ప్రజాజీవితం లో ఉన్న వారిని.. ప్రముఖుల కు కొన్ని తిప్పలు ఎదురవుతుంటాయి. ఇలాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలన్నది ఆర్ట్. ఎదుటోడికి మనం అద్భుతం కావొచ్చు. అలాంటిదేమీ మనకు ఉండక పోవచ్చు. అంత మాత్రాన.. మీరు అద్భుత మని ఫీలయ్యే వారికి క్లాస్ పీకి.. మీరు నా గురించి అనుకుంటున్నది తప్పు.. నేను అద్భుతాన్ని కాదు అని చెప్పినంతనే మార్పు వస్తుందా? ఒక వేళ అదే మాట అంటే.. మీకు మీరు అద్భుతం గా అనిపించకపోవచ్చు. కానీ.. నా వరకు నాకు మాత్రం మీరు అద్భుతమే అని అంటే ఎవరేం చెప్పగలరు? అభిమానించే వాడికి.. ఆరాధించే వాడికి వాడికుండేది వాడికి ఉంటుంది. అలాంటి వారి అభిమానాన్ని కొన్ని సార్లు భరించటం కష్టంగా ఉంటుంది. కాదనలేం. కానీ.. అలా అని వారిని తప్పు పడుతూ కూర్చోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఈ చిన్న విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు అర్థం చేసుకోవటం లేదన్నది ప్రశ్నగా మారింది. పవన్ కల్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఇవాల్టి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా రాజకీయ కార్యక్రమాని కి భారీ గా ప్రజలు హాజరు కావాలంటే.. అందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిందే. ఎలాంటి ఖర్చు లేకుండా.. బిర్యానీ.. క్వార్టర్ సీసా.. కాసిన్నిడబ్బులు లాంటివి ఏమీ లేకుండా.. వేలాది గా తరలి వచ్చే అవకాశం వేళ్ల మీద లెక్క పెట్టేంత వారికి మాత్రమే ఉంది. ఆ కోవ లో కే వస్తారు పవన్ కల్యాణ్. ఆయన ఏర్పాటు చేసే సభల కు వచ్చే వారంతా అభిమానం తో రావటమే కానీ.. వారికి ఏమీ ఇవ్వరన్నది అందరికి తెలిసిందే.
అలా వచ్చిన వారు పవన్ కల్యాణ్ మీద ఉన్న అభిమానం తో.. పవర్ స్టార్ అని.. కాబోయే సీఎం అని తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తుంటారు. మామూలు గా అయితే.. ఇలాంటి వాటిని తనకు అనుకూలం గా మార్చుకునే నేతలు ఉంటారు. కానీ.. పవన్ కల్యాణ్ కు ఇలాంటివి ఇష్టం ఉండదని చెబుతారు. మొదట్లో ఇలాంటి వాటిని చూసిచూడనట్లు వ్యవహరించినా.. ఎన్నిక ల్లో దారుణ ఓటమి.. తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటం తో ఆయన తీరులో మార్పు వచ్చింది. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేసే వారిపైనా చిర్రు బుర్రు లాడేవారు.
తాజాగా పవర్ స్టార్ అంటూ నినాదాలు చేసే వారి ని సైతం ఆయన తప్ప పడుతున్నారు. తనను అలా పిలవొద్దంటున్నారు. తన ను పవర్ స్టార్ అనొద్దంటూ కాసింత ఘాటు గానే రియాక్టు అయ్యారు. అభిమానులు అభిమానం తో అనే మాటలకు అనవసరంగా రియాక్టు అయ్యే కంటే.. వాటిని పట్టించుకోనట్లుగా ఉండటం మంచిది. ఒక వేళ.. అలాంటి నినాదాలు వద్దని చెప్పినా.. వారు అభిమానం తో పిలుస్తామని చెబితే పవన్ మాత్రం ఏం చేయగలరు. అభిమాన తన్మయత్వం తో అనే మాటలు ఎంత చిరాగ్గా ఉన్నా..వాటిని అడ్డుకోవటం ద్వారా ఇబ్బందే తప్పించి మరింకేమీ ఉండదు.
విశాఖ లో ఏర్పాటు చేసిన సభ లో పవన్ మాట్లాడిన మాటల కంటే కూడా..అభిమానుల పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన ఉదంతమే సోషల్ మీడియా లో ఎక్కువగా వైరల్ అయ్యింది. పవన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని.. ఆయన ఇలాంటి వాటికి అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా.. అసలు విషయం పక్కకు వెళ్లి.. కొసరు విషయాల మీద పెద్ద చర్చ జరుగుతుందన్న విషయాన్ని పవన్ ఎంత త్వర గా గుర్తిస్తే అంత మంచిది.