తెలంగాణలో పోటీకి సిద్ధమవుతున్న జనసేన?

Update: 2022-12-12 03:30 GMT
తెలంగాణలో పోటీచేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జనసేన చేస్తోంది. తెలంగాణలో కూడా పోటీచేసేందుకు కేడర్ సిద్దంగా ఉండాలంటూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల పిలుపునిచ్చారు.

పవన్ కళ్యాణ్ ఆదేశాల  మేరకు 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేసినట్లు తెలంగాణ జనసేన ఇన్ చార్జి శంకర్ గౌడ్ వెల్లడించారు. వీరికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించి అధినేతకు నివేదిక అందజేస్తారని.. ఆ నివేదిక ఆధారంగా అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.

ఏపీలో పూర్తిస్థాయిలో పోటీకి సిద్ధమవుతున్న జనసేన తెలంగాణలో కూడా పోటీకి సిద్ధమైంది. మరోవైపు కేసీఆర్.. బీఆర్ఎస్ పేరుతో ఏపీలో అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణలో జనసేన ఎవరి ఓటు చీలుస్తుంది? ఏపీలో బీఆర్ఎస్ ఎవరి ఓటు చీలుస్తుంది? అనే విషయంలో విశ్లేషకులు సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నారు.

కొద్దిరోజులు తమ పార్టీ కార్యకలాపాలను మరింత ఉధృతం చేసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తే కానీ ఇక్కడి పరిస్థితి ఏమిటనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఏపీలో జనవాణి కార్యక్రమంలో పార్టీ ఇమేజ్ ను పెంచిన పవన్ తెలంగాణలో పోటీ చేస్తున్నట్లు  గతంలో స్పష్టం చేశారు. ఎన్ని స్తానాల్లో పోటీ చేయాలనేది తర్వాత వెల్లడిస్తామన్నారు. కొండగట్టు నుంచి తెలంగాణ రాజకీయం మొదలుపెట్టబోతున్నట్లు చెప్పారు.

ఇటీవల ఒక కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ 1947లో కర్నూలులో మనం జెండా ఎగురవేశామని.. 1948లో తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని.. రజాకార్ల దాష్టీకంతో ప్రజలు నలిగిపోయారన్నారు.  శ్రీకాంతాచారితో సహా వెయ్యిమంది బలిదానంతో తెలంగాణ ఏర్పడిందన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News