పాలమూరు ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు ఖర్చు చేశారంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు వాదించటం.. ఈ విషయంలో కావాలంటే చర్చకు రావాలంటూ తెలంగాణ అధికారపక్షానికి సవాలు విసరటం తెలిసిందే.
మామూలుగా సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. బహిరంగ చర్చకు చాలెంజ్ లు చేసుకోవటం.. రెండు.. మూడు రోజులు అయ్యాక ఎవరి పనిలో వారు బిజీగా ఉండటం మామూలే. అందుకు భిన్నంగా పాలమూరు ఎత్తిపోతల విషయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్ గా తీసుకున్నారు. సవాలు విసిరిన తెలంగాణ తెలుగు దేశం నేత రావుల చంద్రశేఖర్ రియాక్ట్ కావటం.. ఆ తర్వాత ఆయన కూడా కామ్ అయిపోవటం తెలిసిందే. దీంతో.. పాలమూరు ప్రాజెక్టు విషయంలో చర్చకు రావాలంటూ ఛాలెంజ్ విసరటమే కాదు.. అసెంబ్లీ కమిటీ హాల్ కు వచ్చి.. నేను వచ్చా.. మీరు వస్తారా? అంటూ మీడియాలో చెప్పటం తెలిసిందే.
బుధవారం కూడా జూపల్లితో చర్చకు ఏ తెలుగుదేశం నేత ముందుకు రాలేదు. దీంతో.. తెలుగు తమ్ముళ్లపై జూపల్లి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు మీద చర్చకు రాకుండా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు తోక ముడిచారని మండి పడ్డారు. బహిరంగ చర్చకు అసెంబ్లీ కమిటీ హాల్ కు వచ్చే విషయంలో ఏదైనా అభ్యంతరం ఉంటే.. ఏదైనా ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో అయినా చర్చకు తాను రెఢీ అని చెప్పుకొచ్చారు. మరి.. సవాలుకు సిద్ధమన్న తమ్ముళ్ల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో..?