గ్యాంగ్‌ స్ట‌ర్ వికాస్ దూబే అరెస్ట్‌!

Update: 2020-07-09 06:30 GMT
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌ స్టర్ వికాశ్ దూబే ను పోలీసులు  అరెస్టు చేసారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని ఉజ్జ‌యినిలో గురువారం అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా  గ్యాంగ్‌ స్టర్ వికాశ్ దూబే జాడ కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని ఉజ్జెయిని లో అతడ్ని అరెస్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. ఉజ్జెయిని లో మ‌హాకాళేశ్వ‌రుడికి పూజ‌లు నిర్వ‌హించేందుకు వికాస్ అక్క‌డ‌కు వెళ్లగా ,  మ‌హాకాళేశ్వ‌రుడి ఆల‌యంలో ప‌నిచేస్తున్న ఓ గార్డు అత‌న్ని నిర్బంధించి ఆ విష‌యాన్ని ఉజ్జెయిన్ ఎస్పీ మ‌నోజ్ సింగ్‌ కు తెలిపాడు. ఆ త‌ర్వాత ఉజ్జెయిని పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది.

కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను బ‌లి తీసుకున్న ఘ‌ట‌న‌ లో వికాస్ దూబే ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నాడు.  దీనితో దూబే కోసం పోలీసులు జోరుగా వేట కొనసాగించారు. ఈ  నేపథ్యంలోనే  హర్యానా,ఢిల్లీ,యూపీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.  ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు అత‌ని న‌లుగురి అనుచ‌రుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌ స్ట‌ర్‌ కు అత్యంత స‌న్నిహితుడు, అత‌ని బాడీగార్డు అమ‌ర్ దూబేను పోలీసులు మంగ‌ళ‌వారం ఎన్‌ కౌంట‌ర్ ‌లో కాల్చి చంపేశారు.  నిన్న అమర్ దుబే చనిపోగా.. తాజాగా ప్రభాత్ కూడా హతమయ్యాడు. కాన్పూర్‌ లోని త‌న ఇంటి నుంచి త‌ప్పించుకున్న వికాస్ ఆ త‌ర్వాత పోలీసులకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు. ఎట్టకేలకి వికాశ్ దూబే పోలీసుల చేతికి చిక్కాడు.

Tags:    

Similar News