సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చాలానే హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన హమీల్లో ముస్లింలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించటం. అయితే.. ఈ హామీ ఇచ్చి రెండేళ్లు దాటుతున్నా.. ఇప్పటివరకూ దాని ఊసే కేసీఆర్ ఇచ్చింది. అప్పుడప్పుడు మైనార్టీ నేతలు పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ మీద విమర్శలు చేస్తుంటారు. తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అయితే.. కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేసిన పక్షంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని గతంలో సవాలు చేశారు కూడా.
ఇదిలా ఉంటే.. మైనార్టీలకు తానిచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులో అనుసరిస్తున్న విధానాన్ని ఫాలో కావాలని భావిస్తున్నారు.
తమిళనాడు తరహలో ప్రత్యేక చట్టం ద్వారా మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లే.. తెలంగాణలో కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లపై రాజ్యాంగ నిబంధన ఉందని.. ఆ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్లుగా కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున.. వారి సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. మాటల్లో చెప్పినంత సులువుగా చేతల్లో కేసీఆర్ ఎంతమేర చేసి చూపిస్తారా? అన్నది అసలు ప్రశ్న.