తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాలు వేయడంలో దిట్ట. ఆయన ఏం చేసినా.. తనకు లాభం లేకుండా ఏమీ చేయరనే వాదన కూడా ఉంది. ఇప్పుడు.. తాజాగా ఆయన వేసిన అడుగులు పరిశీలించిన వారు కూడా ఇదే చెబుతున్నారు. తాజాగా.. ఎమ్మెల్సీ పదవుల పందేరం జరిగింది. వీరిలో కీలక నేతలు.. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ దూరం పెట్టిన నాయకులు ఉన్నారు. అయితే.. ఒక్కసారిగా వీరిని దగ్గరకు తీసుకోవడం వెనుక.. హుజూరాబాద్ ఎఫెక్ట్ కనిపిస్తోందని అంటున్నారు అదేసమయంలో ప్రస్తుతం ఎమ్మెల్సీలవుతున్న వారిలో ఇద్దరిని.. మంత్రులుగా కూడా తీసుకునే ఛాన్స్ ఉంది.
శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటి వరకు గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కలపల్లి రవీందర్, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, రవీందర్ రావు, వెంకట్రామిరెడ్డి ప్రగతి భవన్‌కు చేరుకుని కేసీఆర్ ఆశీస్సులు తీసుకుననారు. అయితే.. ఎమ్మెల్యే కోటాలొని ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం కానున్నాయి.
ఇక, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అనూహ్యంగా ఓ కొత్త వ్యక్తి పేరు తెరమీదకు వచ్చింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాష్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు బండా ప్రకాష్. సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందజేశారు. వీరంతా అసెంబ్లీలో నామినేషన్ వేశారు. అయితే. త్వరలోనే కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్టు టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన ఎస్సీ సామాజిక వర్గంతోపాటు.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గుత్తాకు కూడా.. మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు.
ఎస్సీ వర్గం నుంచి మాజీ మంత్రి కడియం శ్రీహరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హుజూరాబాద్ ఉప పోరులో .. టీఆర్ ఎస్ కు దెబ్బతగిలిన దరిమిలా.. ఎస్సీ వర్గాన్ని తనవైపు తిప్పుకొనే ప్రయత్నంలో భాగంగా.. కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. కడియంకు మంత్రివర్గంలో బెర్త్ ఇవ్వడంతో.. పార్టీలో వర్గపోరుకు చెక్ పెట్టడంతోపాటు.. ఎస్సీలను మచ్చిక చేసుకునే అవకాశాన్ని అందిపుచ్చుకునే ఛాన్స్ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక, గుత్తాకు అవకాశం ఇవ్వడం ద్వారా.. మరింత మంది.. వలస నేతలను ప్రోత్సహిచండంతోపాటు.. పార్టీ రెడ్డిసామాజికవర్గాన్ని ఆకర్షించి.. తద్వారా.. కాంగ్రెస్‌ను దెబ్బతీయొచ్చనేది వ్యూహంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.