చాలా మామూలు సంభాషణే. కాకుంటే.. మాటల్లో నేనున్నాన్న భరోసా.. ప్రేమ..అప్యాయత.. అన్నింటికి మించి..త్వరలో కబురు చేస్తా.. ఓసారి ఇంటికి వచ్చి వెళ్లమ్మా అంటూ ఒక సామాన్యురాలికి.. సీఎం స్థాయి వ్యక్తి సంభాషిస్తే.. అంతకుమించి కావాల్సిందేముంది? ఏదో మాట్లాడామంటే..మాట్లాడినట్లు కాకుండా.. ఓ పెద్దనాన్న మాట్లాడినంత అప్యాయంగా మాట్లాడితే.. ప్లాట్ కావటం ఖాయం. ఒక్కరితో మాట్లాడిన మాటలు కోట్లాదిమంది శ్రద్ధగా వినటమే కాదు.. లక్షలాది మంది మనసుల్లో ఉండే భావన పూర్తిగా మారిపోవటం ఖాయం.
మాటలతో మనసుల్ని గెలుచుకోవటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్తేం కాదు. అయితే.. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు ఎలా అందుతున్నాయన్న విషయాన్ని నేరుగా తెలుసుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం..ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు టచ్చింగ్ గా ఉండటమే కాదు.. ఉంటే ఇలాంటి సీఎమ్మే ఉండాలి సుమిఅన్న భావన కలుగజేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి.
ఉగాది వేళ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దత్తత తీసుకున్న ఖమ్మం గ్రామీణ మండలం మద్దులపల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్లను సామూహికంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. సామూహిక గృహప్రవేశాల తర్వాతి రోజు.. లబ్థిదారుల్లో ఒకరైన నాగమణి అనే యువతికి సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది.
మీతో ముఖ్యమంత్రి మాట్లాడతారంటూ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన మాటలిచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే..సీఎం కేసీఆర్ లైన్లోకి వచ్చేశారు. ‘‘అమ్మా నాగమణీ నేను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును మాట్లాడుతున్నా’’ అంటూ మొదలైన సంభాషణ ఆమె ఏం చేస్తుంటారన్న వివరాలతో పాటు.. డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందా? ఎలా ఫీల్ అవుతున్నావ్? మీ ఊళ్లో అభివృద్ధి ఎలా ఉంది?లాంటి ప్రశ్నలు చాలానే వేసేవారు.
తాము చాకలి వాళ్లమని.. ఊళ్లో వాళ్ల బట్టలు తాను ఉతుకుతానని నాగమణి చెప్పింది. తాను ఏడో తరగతి వరకూ చదువుకున్నానని.. ఇద్దరు పిల్లలని.. కన్నవాళ్లు.. తోడబుట్టినవాళ్లు వదిలేసినా.. మనోధైర్యంతో బతుకుతున్నానని.. అలాంటి తనను..తన పిల్లల్ని మీరు (ముఖ్యమంత్రి) ఆదుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. మంత్రి తుమ్మలకు రుణపడి ఉంటామని.. ఊళ్లో అభివృద్ధి బాగా జరుగుతుందని.. గ్రామం మొత్తంలో 1450 మంది ఉంటారన్నారు. గ్రామంలో ఒంటరి మహిళలు ఎంతమంది ఉంటారని అడిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆరుగురు ఉంటారని సమాధానం చెప్పిన ఆమెకు..వారికి ఫించన్ ఇస్తే బాగుంటుందా? అనిఅడగటం..బాగుంటుందన్నఆమె మాటకు.. మీ ఊరి వరకే ఇస్తే సరిపోతుందా?.. రాష్ట్రంలోని వారందరికి ఇవ్వాలా? అని అడిగారు.
దానికి బదులిచ్చిన నాగమణి.. అందరికి ఇవ్వాలని..అలా ఇస్తే..ఆర్థికంగా అసరాకల్పించినవాళ్లు అవుతారన్నారు. అలా చేస్తే.. ఆర్థికంగా అసరా ఇచ్చిన మీరు బతికి ఉన్నంతవరకూ వాళ్లంతా మీకు రుణపడి ఉంటారు సార్ అన్న మాటలు కేసీఆర్ ను సంతృప్తి పర్చాయి. చివర్లో.. ‘‘అమ్మ..కబురు చేస్తా.. హైదరాబాద్ వచ్చి ఓసారినన్ను కలువు అంటూ తన సంభాషణ ముగించారు. ఈ తరహా మాటలు కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని చెప్పాలి. ఎక్కడా గొప్పలు చెప్పకుండా.. తానెంత గోప్పోడినన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేసే టాలెంట్ ఆయనకు చేతనైనంత బాగా మరెవరికీ చేతకాదేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/