అమ్మాయి పుడితే రూ.లక్ష డిపాజిట్ - ఖుష్బూ

Update: 2021-03-28 08:44 GMT
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు కోటలు దాటుతున్నాయి. ఇప్పటికే ఓ అభ్యర్థి చంద్రమండలంపైకి తీసుకెళుతానని హామీనివ్వడం సంచలనమైంది. తాజాగా బీజేపీ తరుఫున ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ప్రముఖ నటి ఖుష్బూ సైతం ఓ పెద్ద హామీ ఇచ్చారు. సీనియర్ నటి ఖుష్బూ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు ఖుష్బూ.  తాను ఎమ్మెల్యేగా గెలిస్తే తన నియోజకవర్గంలో అమ్మాయి పుడితే బ్యాంకులో రూ. లక్ష డిపాజిట్ చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుష్బూ సంచలన ప్రకటన చేశారు.

ఈ క్రమంలోనే శనివారం తన నియోజకవర్గ పరిధిలో ఖుష్బూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ముఖ్యమని ఈ సందర్భంగా ఖుష్బూ అన్నారు. తన నియోజకవర్గంలో ఆడపిల్లలు పుడితే వెంటనే వారి పేరు మీద లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు.

ఆడపిల్లలకు సాయం అందించాలని.. తద్వారా బ్రూణ హత్యలను నివారించవచ్చని ఖుష్బూ అన్నారు. ప్రచారంలో భాగంగా ఆమె ఒక టిపిన్ సెంటర్ దగ్గర దోశలు వేశారు. ప్రజలను ఆకట్టుకునేందుకు హామీల వర్షం గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. 
Tags:    

Similar News