ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా రాదా ఇప్పటికీ ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేదు..వస్తుందన్న ఆశతో ఏపీ ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ ఆశతో ఉంటే ముమ్మాటికి రాదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లాంటి సీనియర్లు తెగేసి చెపుతున్నారు. ఆశనిరాశల మాటలు ఎలా ఉన్నా ప్రత్యేక హోదా కోసం బలిదానాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ప్రత్యేక హోదా అన్ని సమస్యలకు జిందా తిలిస్మాత్ లాంటిది కాదని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుందని అనుకోకూడదని కోడెల చెప్పారు. ప్రత్యేక హోదాపై పోరాటాలు , రాజకీయాలు అవసరం లేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఈ రోజు కొత్తగా అడగడం లేదని..రాష్ర్ట విభజనకు ముందే ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం అధికరాపక్షంతో పాటు ప్రతిపక్షాలకు కూడా పోరాడాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా అన్న అంశాన్ని దేశంలో ఎవ్వరు వ్యతిరేకించరని...ఒక వేళ కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాను మించిన ప్రయోజనాలు ఇచ్చినా తమకు ఆమోదయోగ్యమే అని కోడెల అన్నారు. ఏపీకి ప్రయోజనాలు ఏ రూపంలో వచ్చినా ఓకే అని ఇందుకోసం ఉద్యమాలు చేస్తాం..ప్రాణాలు తీసుకుంటాం అనడం సరికాదని ఆయన చెప్పారు. ఏదేమైనా కోడెల మాటలను బట్టి మరోసారి ప్రత్యేక హోదా కష్టం అన్న సంకేతాలు వెలువడ్డాయి. ప్రత్యేక హోదా రాకున్నా అంతకు మించిన ప్రయోజనాలు వచ్చినా తమకు ఓకే అన్న ఆయన మాటల్లోనే ప్రత్యేక హోదా కష్టమని తెలిసిపోతోంది.