ఆంధ్రుల ప్రేమకు కేటీఆర్ ఫిదా.. మేం అన్నాద్ములమని ప్రకటన

Update: 2022-02-12 12:32 GMT
రాష్ట్రాలుగా విడిపోయినా తమ మధ్య ఉన్న అనుబంధం మాత్రం చెరిగిపోలేదని మంత్రి కేటీఆర్ మరోసారి నిరూపించారు. అన్నాదమ్ములం మేం అంటూ అప్యాయతను పంచుకున్నారు. ఆంధ్రా మంత్రి పెళ్లికి వెళ్లిన కేటీఆర్ కు అనూహ్య గౌరవం దక్కగా..ఈ స్థాయి ఆదరణ చూసి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ లో హాట్ కామెంట్స్ చేశారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అన్నదమ్ముల బంధంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర నాయకుడి కుమారుడి వివాహానికి హాజరైన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం జరిగిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తనయుడు లక్ష్మీనారాయణ సందీప్ వివాహానికి కేటీఆర్ హాజరయ్యారు. సభా వేదిక వద్దకు చేరుకున్న కేటీఆర్‌కు మంత్రి బొత్స ఘనస్వాగతం పలికారు.

కేటీఆర్ చేయి పట్టుకుని బొత్స నూతన దంపతులు కూర్చున్న వేదిక వద్దకు తీసుకెళ్లారు. కేటీఆర్ దంపతులకు అభినందనలు తెలిపి వేదిక దిగిపోయారు. వివాహానికి హాజరైన పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు కేటీఆర్‌ను చుట్టుముట్టి సెల్ఫీలు దిగారు.

నిన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ గారి కుమారుడిని ఆశీర్వదించడానికి వెళ్ళాను, ఏపీకికి చెందిన నా సోదరుల ప్రేమతో పొంగిపోయాను . మేము రెండు వేర్వేరు భౌగోళిక రాష్ట్రాలుగా విడిపోయి ఉండవచ్చు; తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వ్యక్తిగత ప్రేమాభిమానాలు అలాగే ఉంటాయి’’ అని వివాహ వేడుకలో గడిపిన వీడియోను కేటీఆర్ ట్వీట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.

కేటీఆర్‌ కూడా ఆంధ్రా మంత్రి పెళ్లిలో ఇంత ఆదరణను ఊహించలేదని, తనకు రాష్ట్రంలో కాస్త ఫాలోయింగ్ ఉందని నిజంగానే ఉబ్బితబ్బిబ్బవుతున్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News