శుక్రవారం నాడు లోక్‌సభలో ఎన్డీఏ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అవిశ్వాసంపై - ఎన్డీఏ సర్కార్ పాలనపై వివిధ పార్టీల అభిప్రాయాలను పక్కన బెడితే....సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సీరియస్ స్పీచ్ ...ప్రధాని మోదీకి హగ్ ....వింక్ ...వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీని రాహుల్ హగ్ చేసుకోవడం తోపాటు....ప్రియా ప్రకాశ్ వారియర్ కు దీటుగా రాహుల్ కన్నుగీటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిన్న జరిగిన పరిణామాలను ఏపీ - తెలంగాణలతో పాటు దేశం మొత్తం నిశితంగా పరిశీలించింది. అయితే, ఇంత సీరియస్ డిస్కషన్ తో పాటు కొన్ని ఫన్నీ మూమెంట్స్ ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మిస్సయ్యారట. తన కార్యక్రమాలలో ఫుల్ బిజీగా ఉన్న కేటీఆర్....పార్లమెంట్ లో చర్చను చూడలేకపోయారట. అందుకే, నిన్నటి పార్లమెంట్ చర్చపై కేటీఆర్ తాజాగా ట్వీట్ చేశారు.
మంత్రి కేటీఆర్ ....ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. రాజకీయ - సామాజిక అంశాలపై కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తుంటారు. నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలపై కేటీఆర్ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ‘నేను మేజర్ డ్రామా లైవ్ ను చూడటం మిస్సయినట్లుంది. కౌగిలింతలు - కన్ను కొట్టడాలు - వాక్చాతుర్యాలు ఎట్ సెట్రా’ అని కేటీఆర్...రాహుల్ ఎపిసోడ్ పై ఫన్నీగా స్మైలింగ్ ఎమోజీతో ట్వీట్ చేశారు. దాంతోపాటు, అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్ సభలో టీఆర్ ఎస్ తరపున మాట్లాడిన ఎంపీ వినోద్ ను కేటీఆర్ అభినందించారు. ‘కరీంనగర్ ఎంపీ వినోద్ గారికి నా అభినందనలు.. తెలంగాణ ప్రజలకు కేంద్రం చేసిన అన్యాయం - నెరవేర్చని హామీలను బాగా హైలెట్ చేశారు. వెల్ డన్ సర్’అంటూ వినోద్ పై ప్రశంసలు కురిపిస్తూ మరో ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.