ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు రాసిన లేఖను విడుదల చేసి సంచలనం సృష్టించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ఏపీ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబ రావు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అని పీయూష్ గోయల్ కు సవాల్ విసిరారు.
ఇక అంతేకాదు.. బీజేపీ వాదనే కరెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో పోటీచేసిన బీజేపీ అభ్యర్థులు ఎవరైనా సరే ఎంపీగా డిపాజిట్ తెచ్చుకుంటే తాను రూ.5 లక్షలు ఇస్తానని కుటుంబరావు ప్రకటించారు. అదే బీజేపీ నుంచి ఒక్కరు గెలిచినా రూ.15 లక్షలు ఇస్తానని సవాల్ చేశారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాకు డిపాజిట్ వస్తే రూ.10లక్షలు ఇస్తానని బీజేపీని ఎండగట్టారు. ఈ నగదును టీడీపీ నుంచి తీసుకోనని.. తన సొంత డబ్బునే ఇస్తానని కుటుంబరావు స్పష్టం చేశారు.
ఏపీలో బీజేపీ పని ఖతమైందని.. ప్రజాశాంతి పార్టీకే బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయని కుటుంబ రావు స్పష్టం చేశారు. టీడీపీకి 135 అసెంబ్లీ సీట్లు తగ్గవని చాలెంజ్ చేశారు. ఏపీలో బీజేపీ మరణించిన పార్టీగా కుటుంబ రావు కుండబద్దలు కొట్టారు.
అధికారంలో ఉన్నన్నీ నాళ్లు బీజేపీతో అంటకాగిన టీడీపీ ఇప్పుడు ఎన్నికలకు ఏడాది ముందు ఫ్లేట్ ఫిరాయించేసిందని... బీజేపీని బూచీగా చూపి ఓట్లు దండుకునే ప్రయత్నాలను ప్రారంభించేసిందని బీజేపీ నేతలు ఆడిపోసుకుంటున్నారు. ఎన్ని చాలెంజ్ లు చేసినా ఈసారి టీడీపీ ఓటమి ఏపీలో ఖాయమని కుటుంబ రావు విమర్శలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.