ఆ ప్రదేశం చూస్తే ఎవరైనా తల వంచి దండం పెడతారు. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ప్రసాదించే అత్యున్నతమైన విద్యా వేదిక అది. విశాఖలో ఘనత వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం అది. అక్కడ వచ్చిన వారు పరిశోధకులుగా, విద్యా బోధకులుగా తమను తాము తీర్చిదిద్దుకుని భావి తరాలకు బంగారు బాటలు వేస్తారు.
విశాఖలో దాదాపు వందేళ్ల క్రితం వెలసిన ఏయూ ఎన్నో కీర్తి కిరీటాలను అందుకుంది. ఏయూ నుంచి ఎందరో ఉన్నత పదవులు అందుకున్నారు. అలాంటి ఏయూలో ఇపుడు అనేక అరాచక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు ఏయూ వేదికగా మారుతోందన్న విమర్శలు ఉన్నాయి.
దీని మీద ఏయూ యాజమాన్యం ఇపుడు దృష్టి పెట్టింది. మొత్తం జల్లెడ పడుతోంది. ఏయూని ప్రక్షాళన చేసే దిశగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఎన్నో గత దారుణాలు వెలుగుచూస్తున్నాయి. క్లీన్ ఏయూ పేరిట సాగుతున్న ఈ ఆపరేషన్ లో దిగ్బ్రాంతికరమైన విషయాలు వెల్లడి అవుతున్నాయి. ఏయూలోని ఖాళీగా ఉన్న చోట దారుణంగా తుప్పలు మొలచిన చోట వాటిని జేసీబీలను తెచ్చి మరీ తొలగిస్తున్నారు.
ఇలా తొలగిస్తున్న వేళ అక్కడ చాలా చోట్ల కుప్పలు పొసిన కండోమ్ ప్యాకెట్స్ కనిపించడం విశేషం. దాని చూసి క్లీన్ ఏయూ నిర్వాహకులే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. అంతే కాదు ఖాళీ మద్యం బాటిళ్ళు కూడా అక్కడ పెద్ద ఎత్తున కనిపించాయి. దాంతో అసలు అక్కడ ఇంతకాలం ఏం జరుగుతోంది. ఏయూలోని పటిష్టమైన నిఘా ఇప్పటిదాకా ఏమైంది అన్న చర్చ మొదలైంది.
పెద్ద ఎత్తున అసాంఘిక కార్యకలాపాలు విద్యా సంస్థ ప్రాంగణంలోనే జరుగుతూండడం పట్ల కూడా ఏయూ వర్గాలతో పాటు స్థానికులు కూడా నివ్వెరపోతున్నారు. ఇంతలా జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి ఇప్పటికైనా తుప్పలను తొలగించి మేలు చేస్తున్నారు అని ఇపుడు ఏయూకి పట్టిన ఆ తుప్పుని కూడా వదిలించి ఏయూ చిరకీర్తిని కాపాడాలని కూడా కోరుతున్నారు.
నిజానికి చదువు మెదడుకు ఎక్కాలి. సమాజానికి ఉపయోగపడాలి. కానీ మెదడుని మత్తుతో బరువెక్కించిన వారు ఏయూలో ఉండడం అంటే నిజంగా పవిత్రమైన ప్రాంగణానికే అవమానం అంటున్నారు. ఇక మీదట ఆ బూజుని పూర్తిగా వదిలించాలని డిమాండ్ మేధావుల నుంచి వస్తోంది.