మోడీ చెప్పింది నిజమేనా ?

Update: 2022-05-29 06:33 GMT
దేశానికి సేవలు చేసే ఏ ఒక్క ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదని, దేశంలోని ఏ ఒక్క పౌరుడు సిగ్గుతో తలొంచుకునే పరిస్దితి రానీయలేదని నరేంద్ర మోడీ చెప్పారు. ఇపుడిదే విషయమై మీడియా, సోషల్ మీడియాలో అనుకూల, వ్యతిరేక పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి.

నిజానికి తాను చెప్పింది అబద్ధమని మోడికి కూడా బాగా తెలుసు. రెండు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన వైఖరితో దేశం పరువు యావత్ ప్రపంచం ముందు పోయింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటి నిర్ణయం పెద్ద నోట్ల రద్దు. రాత్రికి రాత్రి చేసిన పెద్ద నోట్ల రద్దు కారణంగా యావత్ దేశంలోని కోట్లాది మంది జనాలు ఎంత అవస్తలు పడ్డారో ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చూశాయి. నోట్ల రద్దుకారణంగా దేశంలో అన్నీ రంగాల్లో ఒక్కసారిగా స్తంభించిపోయాయి.

ముఖ్యంగా వైద్య రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. అత్యవసర ఆపరేషన్లకు కూడా డబ్బులు లేకపోవటంతో ఎంతమంది చనిపోయారో లెక్కేలేదు.

రోజువారీ ఖర్చులకు కూడా చేతిలో డబ్బులు లేక జనాలు బ్యాంకుల ముందు రోజుల తరబడి పడిగాపులు కాశారు. దీని కారణంగా వయోవృద్ధులు ఎంతమంది చనిపోయారో లెక్కలేలేవు. నోట్ల రద్దు తర్వాత కనీసం ఆరుమాసాల పాటు లక్షలాది ఎగువ, మధ్య, దిగువ తరగతుల కుటుంబాలు పడిన అవస్థలు లెక్కలేదు.

తన అలోచిత నిర్ణయంతో కోట్లాదిజనాలను రోడ్డున పడేసినందుకు నిజంగా మోడి సిగ్గుపడాల్సిందే. ఎందుకంటే నల్లధనాన్ని, టెర్రరిజాన్ని నియంత్రించేందుకే పెద్దనోట్ల రద్దని మోడి చెప్పారు. కానీ ఆ రెండు లక్ష్యాలు ఆచరణలో ఫెయిలయ్యాయి.

ఇక రెండో కారణం కరోనా వైరస్ రూపంలో వచ్చింది. ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా హఠాత్తుగా దేశవ్యాప్త లాక్  డౌన్ విదించేశారు. దీనివల్ల తమ ఊర్లకు వెళ్ళేందుకు జనాలకు సౌకర్యాలు లేకపోయింది. దాంతో లక్షలాది మంది జనాలు వందలు, వేల కిలోమీటర్లు పిల్లా పాపలను ఎత్తుకుని రోడ్డున పడాల్సొచ్చింది.

దీనివల్ల వేలాది మంది మధ్యలోనే చనిపోయారు. ఇది జనాలు కాదు యావత్ దేశం సిగ్గుతో తలొంచుకున్న సమయం. మరీ రెండు ఘటనలు మోడీ మీద ఎలాంటి ప్రభావం చూసినట్లు లేదు. అందుకనే అంత నిసిగ్గుగా ఏ పౌరుడిని తలొంచుకునేట్లు చేయలదని చెప్పగలిగారు.
Tags:    

Similar News