కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే.. ఇన్నాళ్లు కాంగ్రెస్ కు బ్రాండ్ అంబాసిడర్లు.. నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ కు పెట్టని కోట.. ఈ బడా కాంట్రాక్టర్లు కాంగ్రెస్ లో అలా ఎదిగారు.. ప్రజల్లో గుర్తింపు పొందారు. వందల కోట్ల ఆస్తిపరులు ప్రజలకు డబ్బులు పంచడంలో ఓట్లు వేయించుకోవడంలో ప్రజాదరణలో ఆరితేరారు. అంతటి ఉద్దండులు పేరు చెబితే నల్గొండ జిల్లాలో ముసలి ముతక అంతా కాంగ్రెస్ వాళ్లనే నమ్ముతారు.
కానీ అన్నను కాంగ్రెస్ లోనే వదిలేసి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఇప్పటికీ కూడా నల్గొండలో కానీ.. మునుగోడులో కానీ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం వృద్ధులకు , పెద్దలకు రిజిస్ట్రర్ కాలేదు. ఆయన ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారని అందరూ అనుకుంటున్నారు.
ఇక్కడ ఇలా అనుకోవడానికి కారణం.. అన్న బలమైన నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రమే బీజేపీలో చేరారు. సో ముసలి ముతకా అందరూ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ పేరు చెబితేనే ‘హస్తం గుర్తు కదా మాకు తెలుసు తెలుసు’ అంటూ అంటున్నారు. ఇదంతా మునుగోడులో పెద్దలను కదిలిస్తే పైకి అంటున్న మాట.. ఇప్పుడు ఇదే బీజేపీకి పెద్ద చిక్కు వచ్చిపడింది.
దశాబ్ధాలుగా కాంగ్రెస్ లో ఉంటూ ఎదిగిన కోమటిరెడ్డి బ్రదర్స్ ను ‘హస్తం’ గుర్తుపైనే ఓటేసి గెలిపించి పంపించారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి మునుగోడులో ప్రచారం చేస్తుంటే.. ‘ఎటు ఓటు వేస్తావ్ తాతా.. అంటే కోమటిరెడ్డికే.. నాకేందుకు తెలియదు.. ‘హస్తం’ గుర్తుకే’ అంటూ అంటున్నారు. ఇది విని బీజేపీ నేతలు తలపట్టుకుంటున్న పరిస్థితి.
రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా ఆ స్థాయిలో మునుగోడులో బజ్ లేదు. జనాలకు వృద్ధులకు, మహిళలకు తెలిసింది లేదు. అందుకే కోమటిరెడ్డిపై అభిమానం కాస్తా కాంగ్రెస్ పై ఓటుగా మారుతుందా? అన్న భయం బీజేపీ అధిష్టానాన్ని వెంటాడుతోంది. ఇదే జరిగితే పేరు కోమటిరెడ్డిది.. గెలుపు కాంగ్రెస్ ది అవుతుంది. అదే జరిగితే డబ్బులు , పరపతి పంచినా కూడా రాజగోపాల్ రెడ్డి తను రాజీనామా చేసి వదిలేసి వచ్చిన కాంగ్రెస్ ను గెలిపించిన వారు అవుతారు.

అందుకే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాడని.. ఆయనది కమలం గుర్తు అని ఇంటింటా పోస్టర్లు, పాంప్లెట్లతో ప్రచారం చేస్తున్నారట బీజేపీ శ్రేణులు. కోమటిరెడ్డి బ్రదర్స్ వల్ల ఇప్పుడు బీజేపీకి ఈ కొత్త తలనొప్పి వచ్చిందంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.