జనసేన అధ్యక్షుడు - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు వామపక్షాల కలయిక బలాన్ని ఇస్తుందా అని సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ లో వామపక్ష పార్టీలైన సీపీఐ - సీసీఎం పార్టీలు జనసేనతో కలసి పనిచేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు పవన్ కల్యాణ్ కు మద్దతుగా పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి.
ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ - తెలుగుదేశం పార్టీలతో కలసి పనిచేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తన రూటు మార్చుకున్నారు. వామపక్ష పార్టీలైన సీపీఐ - సీపీఎంలతో కలసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి వామపక్ష పార్టీలు కూడా సంసిద్ధత వ్యక్తం చేసాయి. ఇక్కడి వరకూ కధ బాగానే ఉంది.
వామపక్షాలకు ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని సాధించే సత్తా లేకపోయినా తమకంటూ కొంత బలముంది. సీపీఐ - సీపీఎంలకు చెందిన కార్యకర్తలు ప్రతీ జిల్లాలోనూ - ప్రతీ మండలంలోనూ - ప్రతీ గ్రామంలోనూ అంతో ఇంతో ఉన్నారు. వారంతా ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ కు సహకరిస్తారా.. అన్నదే ప్రధాన సమస్య . పవన్ కల్యాణ్ సినీ హీరో కావడం - అంతకు ముందు ఆయన అన్న చిరంజీవి ప్రజలకు ఏమిచేయలేకపోవడం వంటివి వామపక్ష కార్యకర్తలు పరిగణలోకి తీసుకుంటారు. అలాంటప్పుడు వామపక్షాలకు చెందిన వారు పవన్ కల్యాణ్ కు మద్దతు ఇస్తారా అన్నదే సందేహం. పైగా క్రమశిక్షణ గల పార్టీలుగా చెప్పుకునే సీపీఐ - సీపీఎం పార్టీలు సినీ అభిమానులతో నిండిన జనసేనకు మద్దత్తిస్తారా అన్నదే ప్రధాన ప్రశ్న .
వామపక్షాలకు సిద్దాంతపరమైన భావజాలం ఉంది. జనసేనకు ఇంకా అలాంటిదేమీ లేదు. దీంతో వామపక్షాల నాయకులు - కార్యకర్తలు అన్యమనస్కంగానే మద్దతు తెలిపే అవకాశం ఉంది. భవిష్యత్తులో జనసేన - వామపక్షాల మైత్రిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.