ఒడిశాలోని కటక్ నగరంలో భారీ దోపిడీ జరిగింది. మారణాయుధాలతో ఓ బ్యాంక్‌లోకి చొరబడ్డ దుండగులు సినీఫక్కీలో భారీ దోపిడీకి తెరలేపారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న ఫైనాన్స్ కంపెనీలోకి చొరబడి రూ. 12 కోట్ల విలువైన బంగారం, నగదు చోరీచేశారు. కేవలం పది నిమిషాల్లోనే ఈ తతంగం మొత్తం పూర్తిచేసి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. కటక్ నగరంలోని రద్దీగా ఉండే ఓ ప్రాంతంలో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థ కార్యాలయంలోకి గురువారం ఉదయం కొందరు దుండగులు చొరబడ్డారు. ముందుగా సెక్యురిటీ గార్డును బెదిరించారు. తర్వాత బ్యాంక్ సిబ్బందిని బాత్రూంలో బంధించారు.
అనంతరం లాకర్లను లూటీ చేశారు. రోజూ లాగే కార్యాలయం చేరుకున్న ఉద్యోగులు యథావిధిగా తమ పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఆయుధాలు ధరించిన నలుగురు దుండగులు ఆఫీస్‌లోకి ప్రవేశించారు. సెక్యూరిటీ గార్డును తుపాకీతో బెదిరించారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్‌ను, ఇతర ఉద్యోగులను బాత్‌రూమ్‌లో బంధించారు. వారి వద్ద నుంచి లాకర్ల తాళాలు లాక్కున్నారు. చోరీ జరిగిన వస్తువులు, నగదు విలువ సుమారు రూ. 12 కోట్లు ఉంటుందని బ్రాంచ్ మేనేజర్ సత్య ప్రధాన్ తెలిపారు. ఇదంతా కేవలం 10 నిమిషాల్లో జరిగిపోయిందని చెప్పారు. దుండగులు కొంత బంగారాన్ని మాత్రం వదిలిపెట్టి మొత్తం తీసుకువెళ్లారని వెల్లడించారు. వాళ్లు హిందీ, ఒడియా భాషల్లో మాట్లాడినట్లు తెలిపారు.
దోపిడీ జరిగిన వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీ జరిగిన సమయంలో బ్రాంచ్‌లో సీసీటీవీలు పనిచేయడంలేదు. దీంతో నిందితులను గుర్తించడం సంక్లిష్టంగా మారింది. దొంగతనం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు కటక్ నగరం నలుమూలల రహదారుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కటక్ డీసీపీ ప్రతీక్ సింగ్ తెలిపారు. పరిసర ప్రాంతాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశామని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లూథియానా శాఖలోనూ ఇదేవిధంగా చోరీ జరిగింది. అప్పట్లో దుండగులు రూ.13 కోట్ల విలువైన 30 కిలోల బంగారంతో పాటు 3.5 లక్షల రూపాయల నగదును చోరీచేశారు.