పవన్ ప్రధానమంత్రి అభ్యర్థి పోటీకి నో..!

Update: 2019-03-20 10:08 GMT
మాయవతిని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యమని - ఆమెను ప్రధానమంత్రిగా చూడాలని అనుకుంటున్నట్టుగా వ్యాఖ్యలు చేశారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. అవన్నీ వ్యూహాత్మక మాటలు అని.. దళిత ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని పవన్ ఆ వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు తేల్చేస్తున్నారు. కనీసం ఒక ఎంపీ స్థానం అయినా కచ్చితంగా గెలుస్తారనే నమ్మకం లేని పవన్ కల్యాణ్.. ఎవరినీ ప్రధానిగా చేసేది ఉండదు - మరెవరినీ ప్రధానిని కానివ్వకుండా ఉండేంత సీనూ ఉండదని.. కేవలం ఏపీలో దళిత ఓటు బ్యాంకు కోసమే అలా మాట్లాడుతున్నారని అంటున్నారు.

అయితే ఎక్కడో ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రాంతీయ పార్టీ అధినేత మాయవతి ప్రభావం ఏపీలో ఉంటుందా అనేది వేరే విషయం. ప్రస్తుతం మాయవతి యూపీలోనే వరస ఓటములతో ఉన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు భారీ ఝలక్ ఎదురైంది. ఈ సారి బీఎస్పీతో చేతులు కలిపి రంగంలోకి దిగుతోంది మాయ. ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

ఆ సంగతలా ఉంటే..తను ఎంపీగా పోటీ చేయడం లేదని ప్రకటించారు మాయావతి. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయడానికి - పార్టీ బాధ్యతల్లో ఉన్నందున  మాయ పోటీకి దూరంగా ఉంటున్నట్టుగా ప్రకటించారు. తద్వారా ఎంపీ రేసులో ఉండటం లేదని తేల్చి చెప్పారు.

ఈమె ఎంపీ రేసు నుంచినే తప్పుకోవడం - ఎంపీగానే పోటీ చేయకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ప్రాంతీయ పార్టీల్లో అధినేతలు చాలా కీలకం. జాతీయ పార్టీల్లో అయితే.. ప్రముఖ నేతలు పోటీ చేసినా - చేయకపోయినా బండి నడుస్తూ ఉంటుంది. అయితే ప్రాంతీయ పార్టీల్లో స్ఫూర్తి నింపాల్సింది అధినాయకత్వమే. అలాంటి సుప్రిమోనే  ప్రత్యక్ష పోటీ నుంచి తప్పుకోవడం విశేష పరిణామమే అవుతుంది!

Tags:    

Similar News