ట్రంప్‌ ది మ‌తిమ‌ర‌పా.. అహంకార‌మా?

Update: 2017-04-18 06:26 GMT
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. నిర్ణ‌యాల‌తో నిత్యం వార్త‌ల్లో ఉండే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మ‌రో వివాదంలో ఇరుక్కుపోయారు.  తాజా ఉదంతంపై అమెరిక‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మిగిలిన విష‌యాల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేసే అమెరిక‌న్లు.. జాతీయ‌భావం విష‌యంలో మాత్రం ఒకే గొంతుక‌తో వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అలాంటిది ట్రంప్ స‌రిగా.. ఆ విష‌యంలో వ్య‌వ‌హ‌రించిన వైఖ‌రి తాజాగా హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. ట్రంప్‌ ను వివాదంలో ఇరుక్కుపోయేలా చేసింది.

అధ్య‌క్ష హోదాలో ఉన్న ట్రంప్‌.. జాతీయ‌గీతాలాప‌న సంద‌ర్భంగా క‌నీసం పాటించాల్సిన గౌర‌వ మ‌ర్యాద‌ల్ని మ‌ర్చిపోవ‌టంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న చేసిన త‌ప్పును ట్రంప్ స‌తీమ‌ణి మెలానియా క‌వ‌ర్ చేయాల‌ని ట్రై చేసినా.. వీడియో సాక్షిగా దొరికిపోయారు. సోమ‌వారం సంప్ర‌దాయ ఈస్ట‌ర్ ఎగ్ రోల్ ను వైట్ హౌస్‌ లో నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా భార్య‌.. కుమారుడితో క‌లిసి ట్రంప్ అతిథుల్ని సాద‌రంగా ఆహ్వానించారు. ముందుగా జాతీయ‌గీతాలాప‌న ఆల‌పించారు.

ఈ సంద‌ర్భంగా హృద‌య‌భాగంలో చేతిని పెట్టుకోవ‌టం అమెరికాలో ఆన‌వాయితీ. దీనికి భిన్నంగా ట్రంప్ మామూలుగా ఉండిపోయారు. ఆయ‌న‌కు భిన్నంగా ట్రంప్ స‌తీమ‌ణి మెలానియా.. వారి కుమారుడు మాత్రం ఆన‌వాయితీని అనుస‌రించారు. ట్రంప్ మామూలుగా ఉండ‌టాన్ని గ‌మ‌నించిన మెలానియా.. ఆన‌వాయితీని గుర్తు చేయ‌టంతో.. ట్రంప్ త‌న చేత‌ని హృద‌య‌భాగానికి ద‌గ్గ‌ర‌గా పెట్టుకున్నారు. ఇదంతా కెమేరా క‌ళ్లు రికార్డు చేయ‌టంతో.. ఈ వీడియో వైర‌ల్‌ గా మారింది. ఆన‌వాయితీని మ‌ర్చిపోయారా? అహంకారంతో ట్రంప్ అలా వ్య‌వ‌హ‌రించారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. దేశాధ్య‌క్షుడిగా ఉన్న వ్య‌క్తే.. జాతీయ గీతాలాప‌న స‌మ‌యంలో అంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిట‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దీనిపై ప‌లువురు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అమెరికాలో పుట్టిన ట్రంప్ కంటే.. వ‌ల‌స మ‌హిళకు అమెరికా సంప్ర‌దాయం గుర్తుంచుకొని గౌర‌వించార‌ని ఫైర్ అయ్యారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.


Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News