అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టటం అంటే మాటలు కాదు. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యంగా అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే కీలక అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది. అందులోకి ట్రంప్ లాంటి తెంపరి వ్యాపారి కమ్ రాజకీయ నాయకుడికి ఒక పట్టాన రాదు. కానీ.. కాలం కలిసి వస్తే..ఎలాంటి పరిస్థితులు అయినా ఏర్పడతాయని చెప్పటానికి ట్రంప్ కు మించిన మంచి ఉదాహరణ మరొకటి ఉండదేమో?
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్వేతసౌధానికి మారిన ట్రంప్ తో పాటు.. ఆయనగారి మోస్ట్ బ్యూటిఫుల్ .. ఛార్మింగ్ మిలానియా వైట్ హౌస్ కు రాకపోవటంపై పెద్ద చర్చే జరిగింది. అయితే.. కొడుకు చదువు కోసం న్యూయార్క్ లోనే ఉండనున్నట్లుగా చెప్పారు. దీంతో.. వైట్ హౌస్ కు ఫస్ట్ లేడీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ట్రంప్ తన తొలి విదేశీ పర్యటన సందర్భంగా రెండుసార్లు భార్య చేతిని అందుకోబోయి.. ఆమె తిరస్కారానికి గురైన వైనం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనానికి తెర తీయటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఇరువురి మధ్య విభేదాలు ఉన్నాయని.. అవి ఎక్కడివరకూ వెళతాయోనన్న సందేహాల్ని వ్యక్తం చేస్తూ ఎవరికి వారు చాలానే వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 14న ట్రంప్ 71వ పుట్టిన రోజు. అయితే.. బర్త్ డే గిఫ్ట్ అనుకోవాలో.. మరొకటో కానీ మెలానియా ఇదే రోజున వైట్ హౌస్ కి షిఫ్ట్ అవుతారన్న మాట వినిపిస్తోంది.
ప్రస్తుతానికి న్యూయార్క్ లో ఉంటున్న ఆమె.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ట్రంప్ బర్త్ డే వేళ.. వైట్ హౌస్ కు వచ్చేసి.. శ్వేతసౌధానికి కొత్త కళ తీసుకొస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. ఫస్ట్ లేడీ లేదన్న లోటుగా ఉన్న అధ్యక్ష భవనానికి ఆ లోటు తీరుతుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/