అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా తన భర్త కంటే నాలుగాకులు ఎక్కువే చదివినట్లుంది. ట్రంప్ నే అంతా పెద్ద మాయగాడు అంటుండగా ఆయన భార్య మెలానియా తాను అంతకంటే ముదురునని నిరూపించుకున్నారు. భర్త పట్ల సెంటిమెంటు రగిలించేందుకు మెలానియా ప్రచారంలో తన ప్రసంగాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తన భర్త చాలామంచివాడని.. ఆయనలోని జాలి, కరుణ చాలా ఎక్కువని.. అవి చూసే తాను ప్రేమించానని కూడా చెప్పుకొచ్చారు. అయితే... మెలానియా ప్రసంగం విన్నవారంతా ఇదెక్కడో విన్నట్లుగా ఉందని అనుకుంటున్నారు. ఎనిమిదేళ్ల కిందటికి వెనక్కు రీవైండ్ చేసేసరికి జనానికి అంతా గుర్తుకొచ్చేసింది. సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట ఒబామా భార్య మిషెల్లీ ఒబామా చేసిన ప్రసంగాన్నే మెలానియా ఇప్పుడు కాపీ కొట్టేశారట.
దీంతో మాజీ మోడల్ అయిన మెలానియా పెద్ద కాపీ మాస్టర్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. ఇటీవల క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సమావేశంలో మెలానియా ట్రంప్ సభనుద్దేశించి మాట్లాడారు. తనను తాను పరిచయం చేసుకోవడంతో పాటు ఒక భర్తగా - తండ్రిగా - సమర్థమైన నాయకుడిగా తన భర్త గొప్పతనాన్ని వివరిస్తూ ఆమె ఉపన్యసించారు. అందులో రెండు సందర్భాల్లో పూర్తిగా ఆమె మిషెల్ ఒబామా ప్రసంగాన్ని రిపీట్ చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. 2008లో డెమోక్రటిక్ పార్టీ తరపున దేశాధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్ ఒబామా నిర్వహించిన తొలి జాతీయ సమావేశంలో మిషెల్ ఒబామా మాట్లాడారు. అప్పుడు ఆమె చేసిన ప్రసంగంలోని కొన్ని పేరాలు ఇప్పుడు మిలానియా ట్రంప్ ప్రసంగంలో మక్కీకి మక్కీగా స్టాంప్ దిగిపోయాయట.