హవ్వా.. దేశంలోనే ఇంతకంటే ఘోరమైన అవమానకరమైన ప్రతిపాదన ఉండదంటే అతిశయోక్తి కాదేమో.. ఏపీలో బీజేపీ గెలిచింది సున్నా సీట్లు.. టీడీపీ గెలిచింది 23 ఎమ్మెల్యే సీట్లు.. రెండు ఎంపీ సీట్లు.. మరి సున్నా సీట్లు గెలిచిన బీజేపీలోకి గుడ్డిలో మెల్లగా సీట్లు రాబట్టుకున్న టీడీపీని విలీనం కావాలని కోరడమే పెద్ద వింత.. తెలుగు దేశం చరిత్రలోనే ఇంతకంటే అవమానకరమైన ప్రతిపాదన ఎప్పుడూ రాలేదని టీడీపీ శ్రేణులు మథనపడుతున్నాయట..
ఏపీలో అస్సలు బలం లేని పార్టీ బీజేపీ...ఇక మొన్ననే అధికారం కోల్పోయి కునారిల్లుతున్న పార్టీ టీడీపీ. ఈ రెండు పార్టీలు విలీనం అయినా కాకపోయినా పెద్దగా మార్పు లేదు. ఎందుకంటే ఏపీలో ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ ఉన్నా లేనట్టే. ఇక ఐదేళ్లు ప్రజలకు నరకానికి స్పెల్లింగ్ రాయించి ఓడిపోయిన చంద్రబాబు పార్టీ వైసీపీ-జగన్ ను తట్టుకొని బతికి బట్టకట్టే ఆశలు అయితే కనిపించడం లేవు. టీడీపీ పరిస్థితిని చూసిన బీజేపీ పెద్దాయన , ఎంపీ జీవీఎల్ నరసింహారావు తాజాగా చంద్రబాబుకు అవమానకరమైన ఆఫర్ ఇవ్వడం రాజకీయంగా సంచలనంగా మారింది.
తాజాగా విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఒక వింత ప్రతిపాదనను చేశారు. ఏపీలో టీడీపీ పని అయిపోయిందని.. ఇక బీజేపీలో టీడీపీని విలీనం చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబును జీవీఎల్ ఆహ్వానించారు. ఈ ప్రతిపాదన హాట్ టాపిక్ గా మారింది.
భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ప్రతిపాదన ఏదీ లేదని... కావాలంటే బీజేపీలో టీడీపీని విలీనం చేసుకోవచ్చని చంద్రబాబుకు జీవీఎల్ ఆఫర్ ఇవ్వడం గమనార్హం. ఓడిపోయిన టీడీపీ నుంచి నేతలు బీజేపీలో చేరితే బీజేపీకి అది బలం కాదని జీవీఎల్ స్పష్టం చేశారు.
ఏపీలో అస్సలు ఉనికే లేని సున్నా సీట్లు సాధించిన బీజేపీ ఏకంగా మొన్నటి వరకు అధికారంలో ఉన్న టీడీపీని, సంస్థాగతంగా బలంగా ఉన్న పచ్చపార్టీని విలీనానికి ఆహ్వానించడమే రాష్ట్ర రాజకీయాల్లో షేక్ చేస్తున్న అంశం.. దీన్నిబట్టి చంద్రబాబు దుస్థితి ఏపీ రాజకీయాల్లో ఎంతగా దిగజారిందో అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక్క ఓటమి చంద్రబాబును మరీ ఇంత చీప్ గా తయారు చేసిందా అన్న ఆవేదన తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోందట..