ప్రసంగాలు దంచాలన్నా.. పోలికలు తేవాలన్నా మన రాజకీయ నాయకుల తర్వాతే ఎవరైనా. రాజకీయం పాలిటిక్స్ దగ్గరే ఆగిపోతే బానే ఉంటుంది కానీ బౌండరీస్ దాటి వేరే ఫీల్డ్స్ లోకి ఎంటరైతేనే తేడాలొచ్చేస్తాయ్. ఏపీ మినిస్టర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇలాగే బ్యాక్ ఫైర్ అయ్యాయ్. మెగాస్టార్ ఫ్యాన్స్ ని చిరాకు పెట్టిస్తున్నాయ్.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు- డబ్బుల కోసం ఏటీఎమ్ దగ్గర నిల్చోడానికి జనాలకి అంత బాధేంటో అర్థం కావట్లేదు.. అదే చిరంజీవి సినిమా టికెట్ కోసమైతే గంటలు గంటలు క్యూలో నిల్చుంటారూ... అప్పుడు లేని నొప్పి ఇప్పుడెందుకంటూ రాంగ్ కంపారిజన్ చేశారు. అంతే మెగాఫ్యాన్స్ కి చిర్రెత్తింది. అసలు ఏటీఎమ్స్ క్యూకి.. చిరంజీవి మూవీకి సంబంధమేంటి అని ప్రశ్నిస్తున్నారు.
అంతేనా చిరంజీవి సినిమా టికెట్ కోసం నిల్చుంటే కనీసం వెయింటింగ్ కి తగ్గ ఫలితమొస్తోంది. మూవీ చూసి ఎంటర్టైన్ అవ్వొచ్చు. సినిమా బాగోకపోయినా ఆ పేరుతో కాసేపు రిలాక్స్ అవుతాం. మరి ఏటీఎమ్స్ దగ్గర నిల్చుంటే ఏం వస్తుంది..? నీరసం తప్ప..! చెప్పినంత డబ్బులు ఎలాగూ ఇవ్వట్లేదు.. బోనస్ గా మాకు కాళ్లునొప్పులు. అయినా రెండ్రోజుల్లో తీర్చాల్సిన సమస్యని నెల రోజులైనా పరిష్కరించకపోగా ఇలా మాట్లాడతారా అంటూ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మోడీ నిర్ణయం మంచిదే అయినా దానివల్ల ఇబ్బందులు పడ్తోంది సామాన్యులేనని.. కుదిరితే ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కనిపెట్టండి తప్ప సంబంధం లేని చిరంజీవిని సీన్ లోకి లాగొద్దని గట్టిగానే చెబుతున్నారు.