ఈటలపై మళ్లీ హరీష్.. సంచలన వ్యాఖ్యలు

Update: 2021-06-27 11:41 GMT
మొన్నటివరకు జిగ్రీ జానీ దోస్తులు.. ఇప్పుడు పక్కా విరోధులుగా మారిపోయారు. ఇన్నాళ్లు తెలంగాణ కేబినెట్ లో జట్టుగా పనిచేసిన స్నేహితులు ఈటల రాజేందర్, హరీష్ రావులు ఇప్పుడు స్వయంగా పరస్పర విమర్శలు చేసుకుంటుండడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల విమర్శలు చేయడం.. దానికి హరీష్ రావు కౌంటర్ ఇవ్వడం జరిగిపోయింది.

తాజాగా మరోసారి ఈటల రాజేందర్ పై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని చెప్పి టీఆర్ఎస్ ను వదిలి వెళ్లిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరి తన ఆత్మగౌరవాన్ని ఆ పార్టీకి తాకట్టు పెట్టారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.కేవలం తన ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలో చేరారని విమర్శించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించి ఈటల నుంచి ఆ నియోజకవర్గానికి విముక్తి కలుగుతుందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ శ్రేణులు బాగా పనిచేయాలని హుజూరాబాద్ లో విజయమే దిశగా ముందుకు సాగాలన్నారు. బీజేపీ కుట్రలను సాగనీయవద్దని అన్నారు.

తాజాగా హరీష్ రావు సమక్షంలో ఇల్లంతకుంట టీఆర్ఎస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని.. ఈటల, ఆయన అనుచరుల వేధింపులు భరించలేకనే తాము పార్టీకి వీడామని ఆయన స్పష్టం చేశారు. 
Tags:    

Similar News