ఏపీలో రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు కొనసాగుతున్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికే ఇలాంటి వివాదాల్లో అరెస్టులు జరిగాయి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను పట్టుకుని కులం పేరుతో దూషించడం వివాదాస్పదం అయ్యింది. శేఖర్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు ఆ వ్యవహారంలో అరెస్టు అయ్యాడు కూడా.
అయినా కూడా అధికార పార్టీపై అసభ్యకరమైన దూషణలు ఆగుతున్నట్టుగా లేవు. తాజాగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీపై అసభ్యకరమైన కామెంట్లు చేసిన వారి అరెస్టు జరిగింది. ఫేస్ బుక్ లో - వాట్సాప్ లో ఆ మహిళా ఎమ్మెల్యేపై ఇద్దరు వ్యక్తులు అసభ్యకరమైన పదజాలంతో ప్రచారాన్ని సాగించినట్టుగా తెలుస్తోంది.
దీనిపై ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితులను అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. రాజకీయ పార్టీలపై ఎవరికైనా అభిమానాలు ఉండవచ్చు. ప్రత్యర్థి పార్టీల వాళ్లంటే పడకపోవచ్చు. అయితే విమర్శలకు హద్దుంటుంది. ఆ హద్దు దాటితే అంతే సంగతులనే విషయాన్ని ఆయా రాజకీయ పార్టీల అభిమానులు గుర్తించినట్టుగా కనిపించడం లేదు. అందుకే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్టున్నాయని పరిశీలకులు అంటున్నారు.