సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి..అదే సోషల్ మీడియా కేంద్రంగా అనూహ్యమైన ఎదురుదాడి ఎదురైంది. ఏకంగా ఆయనపై నెటిజన్లు ఓ రేంజ్ లో దాడి చేశారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తుండగా... ఓ పొరపాటు జరిగింది. భారత్ లో 600 కోట్ల మంది ఓటర్లు ఉన్నారంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్లీనరీ సెషన్ లో మోడీ తన ప్రసంగంలో తెలిపారు. 2014లో మూడు దశాభ్ధాల తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 600 కోట్ల భారతీయ ఓటర్లు రాజకీయ పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చారని తన ప్రసంగంలో మోడీ అన్నారు.
మోడీ తన ప్రసంగంలో చేసిన అదే పొరపాటు ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ట్విట్టర్ ఎకౌంట్ లో కూడా కనిపించింది. పొరపాటు గమనించి ఆ ట్వీట్ ను పీఎంఓ డిలీట్ చేసినప్పటికీ సోషల్ మీడియా నెటిజన్ల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ట్వీట్ ను డిలీట్ చేసే సమయానికే దానికి 400లైక్ లు - 147 రీ ట్వీట్ లు వచ్చాయి. దీనికి కౌంటర్ నెటిజన్లు చెడుగుడు ఆడుతున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2014 లెక్కల ప్రకారం భారత్ లో రిజిస్టర్ అయిన ఓటర్ల సంఖ్య 81.45 కోట్లు మాత్రమే.
ఈ క్రమంలో నెటిజన్లు ఆడుకుంటున్నారు. `ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనం మొత్తం బీజేపీకి ఓట్లేస్తారా.. మీరు గ్రేట్` అని కొందరు వెటకారం ఆడితే.. `120 కోట్లలో 31శాతం అంటే 600 కోట్లు అని కొత్త లెక్క చెప్పారు` అంటూ మరికొందరు కామెంట్ చేశారు. ఓటర్లలో ఆవులు కూడా చేరాయా అని మరికొందరు ట్విట్ చేశారు. ఈసారి టెలిప్రాప్టర్ తప్పు చేసింది అని మరికొందరు వెటకారాలు ఆడారు. ఇలా తమదైన శైలిలో మోడీని ఆటపట్టించే చాన్స్ కోసం ఎదురుచూస్తున్నవారు విరుచుకుపడ్డారు.