ఎంపీ, నటి హేమమాలిని పై నెటిజన్ల ట్రోలింగ్.. ఓరేంజ్ లో ఆడేసుకుంటున్నారు..!
ఎందరో నటులు రాజకీయనాయకులుగా మారి సక్సెస్ అయ్యారు. మరికొందరు ఈ రాజకీయాలు మాకొద్దు బాబూ అంటూ పారిపోయారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి నటులు మాత్రం.. రాజకీయాల్లోనే తమ మార్కు చూపించుకోగలిగారు. సినీ చరిత్రలోనే కాదు.. రాజకీయంగా కూడా తమకు తిరుగులేదని నిరూపించుకున్నారు. వీళ్లను ఆదర్శంగా తీసుకొని చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి భంగపడ్డారు. ఒకప్పుడు రాజకీయ నాయకులతో ప్రజలకు ప్రత్యక్ష సంబంధాలు చాలా తక్కువ. ఎప్పుడో గానీ దర్శనం ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం అలా కాదు.. ఇప్పుడు నడుస్తోంది సోషల్ మీడియా యుగం.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి.
ఏచిన్న తప్పు చేసినా.. సోషల్ మీడియాలో ప్రజలు .. తమ నేతలను ఉతికిఆరేస్తారు. ఇది ఇలా ఉంటే.. బాలీవుడ్ కు చెందిన చాలా మంది నటులు రాజకీయాల్లో రాణించిన విషయం తెలిసిందే. అందులో ప్రముఖ నటి హేమమాలిని ఒకరు. ఆమె చాలా ఏళ్లుగా ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఏడేళ్లుగా ఆమె యూపీలోని మథిర పార్లమెంట్ నియోజవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈనెల 30తో ఆమె ఎంపీగా ప్రమాణం చేసి ఏడేళ్లు గడిచింది. ఈ సందర్భంగా ఆమె ఓ ట్వీట్ చేశారు. 'నేను ఎంపీగా గెలిచి ఏడేళ్లు పూర్తయ్యింది. మీ అభిమానంతో ముందుకు సాగుతున్నాను' అంటూ ఓ ట్వీట్ వదిలారు. అంతే ఇక నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు.
'మీకు ఓటేసినందుకు సిగ్గు పడుతున్నాము. నిజానికి' అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇలా చాలా మంది హేమమాలినికి వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టారు. మీరు ఎంపీగా గెలిచి ఏడేళ్లు పూర్తయ్యింది. మీరు సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వంతో లబ్ధి పొందుతున్నారు. మాకు ఉపయోగం ఏమిటి? అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. తనకు నియోజకవర్గ ప్రజలంతా కృతజ్ఞతలు తెలుపుతారని ఆశించి ఆమె ట్వీట్ పెట్టి ఉంటారు. కానీ ఈ ట్వీట్ మాత్రం ఆమెకు ఎదురుతన్నింది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ బీజేపీ క్రేజ్ ను మసకబార్చింది. అంతర్జాతీయ పత్రికలు సైతం ప్రధాని మోదీపై దుమ్మెత్తి పోశాయి. ఓ వైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే ఎలక్షన్లు ఎందుకు పెట్టారని.. కుంభమేళా వంటి కార్యక్రమాలు ఎందుకు నిర్వహించారని అంతర్జాతీయ పత్రికలు ప్రశ్నించాయి. మరోవైపు సోషల్ మీడియాలోనూ మోదీకి వ్యతిరేకంగా ప్రచారం సాగింది. మరోవైపు కరోనా ఫస్ట్‌వేవ్, సెకండ్ వేవ్ లో హేమమాలిని పెద్దగా ప్రజలకు సేవ చేయలేదు. దీంతో వాళ్లకు చిర్రెత్తుక్కొచ్చింది. వెరసి ఇలా సోషల్ మీడియాలో ఎంపీ హేమమాలిని నెగిటివ్ ట్రోలింగ్ నడుస్తోంది.