విశాఖపట్నం - బెంగుళూరు మధ్య డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించాలని వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో మంగళవారం రైల్వేల పనితీరుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నం నుంచి బెంగుళూరుకు రోజువారీ నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు కావాలన్నది ఎంతోకాలంగా విశాఖపట్నం ప్రజల కోరిక అని ఆయన చెప్పారు. విశాఖ నగరంతోపాటు పొరుగు జిల్లాలకు చెందిన అనేక మంది ఐటీ నిపుణులు బెంగుళూరులో పని చేస్తున్నందున ఈ రైలు సర్వీసుకు అత్యంత ఆదరణ ఉంటుంది. విశాఖ నుంచి బెంగుళూరుకు ప్రయాణించే ఐటీ నిపుణులకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. అలాగే గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించిన విశాఖపట్నం-వారణాసి-అలహాబాద్ రైలు సర్వీసును కూడా త్వరగా ప్రారంభించాలని ఆయన కోరారు.
ఇటీవల రెఫ్రిజిరేటెడ్ కంటైనర్లు కలిగిన రైలు ద్వారా రాయలసీమలోని తాడిపత్రి నుంచి ముంబైలోని పోర్టుకు అరటి పండ్ల రవాణా కోసం ప్రత్యేకంగా నడిపిన రైలు విజయవంతం అయిందని ఆయన అన్నారు. ప్రత్యేక రైలు సౌకర్యం ద్వారా రాయలసీమ రైతులు తాము పండించిన అరటి పండ్లను నేరుగా పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేయగలిగారని చెప్పారు. పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన రాయలసీమ ప్రాంతం నుంచి ముంబైకు ఈ తరహా ప్రత్యేక రైళ్ళను మరిన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలని విజయసాయి రెడ్డి రైల్వే మంత్రిని కోరారు. అలాగే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో కిసాన్ రైలు సర్వీసును ప్రారంభిస్తామన్న ఆర్థిక మంత్రి హామీని ఆచరణలోకి తీసురావడం ద్వారా అటు రైల్వేలకు ఇటు రైతులకు కూడా ఆదాయపరంగా లాభదాయకంగా ఉంటుందని అన్నారు.
గత ఏడాది డిసెంబర్ 2న రైల్వేల ఆర్థిక పరిస్థితిపై కాగ్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నివేదిక ఆందోళకరంగా ఉందని ఆయన అన్నారు. 2017-18లో రైల్వేల ఆపరేటింగ్ రేషియో 98.44 శాతంగా నమోదైంది. అంటే రైల్వేలకు వస్తున్న ప్రతి రూపాయి రెవెన్యూలో 98.44 పైసలు నిర్వహణా ఖర్చులకే పోతోందని నివేదిక చెబుతోంది. గడచిన 10 ఏళ్ళ కాలంలో ఆపరేటింగ్ రేషియో ఈ స్థాయికి చేరడం ఇదే ప్రధమం అని అన్నారు. అలాగే 2016-17లో రైల్వేల రెవెన్యూ మిగులు కూడా గణనీయంగా తగ్గిపోయింది.
నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడు కావడం, ఇతర ఆదాయ మార్గాలు కుంచించుకుపోవడం, సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్ చెల్లింపులు వగైరా కారణాలతో రెవెన్యూ మిగులు క్షీణించిపోతున్నట్లుగా కాగ్ నివేదిక వెల్లడించింది. కాబట్టి బడ్జెట్ సాయంపై ఆధారపడకుండా అంతర్గతంగా ఆదాయ మార్గాల పెంపుపై రైల్వేలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అందుకోసం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంపై రైల్వేలు దృష్టి పెట్టాలని సూచించారు.
సమాజంలోని వివిధ వర్గాలకు ఇచ్చే పాస్ లు - రాయితీలను ఎల్పీజీ లబ్దిదారులకు చెల్లిస్తున్న మాదిరిగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌పై దృష్టి సారించడం ద్వారా అర్హులైన లబ్దిదారులకు మాత్రమే ప్రయోజనం కల్పించి రెవెన్యూ నష్టాలను తగ్గించుకోవాలని ఆయన సూచించారు. రైల్వేలలో ఇటీవల కాలంలో ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి అనేక చర్యలు చేపట్టినందుకు ఆయన రైల్వే మంత్రి పియూష్ గోయల్‌ను అభినందించారు. అలాగే రైళ్ళలో పరిశుభ్రత గతంతో పోల్చుకుంటే ఎంతో మెరుగుపడిందని విజయసాయి రెడ్డి ప్రశంసించారు.