ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారోత్సవం సందర్బంగా ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. మామూలుగా అయితే.. అధికారం కోల్పోయి..విపక్షంలో కూర్చోవాల్సి వచ్చినప్పుడు ఒకింత ఆగ్రహం.. కినుకు కనిపిస్తుంటుంది.అందుకు భిన్నంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన ములాయంసింగ్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా మారారు. చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరైనా అందరి దృష్టిమాత్రం తండ్రీకొడుకులైన.. ములాయం.. అఖిలేశ్ మీదనే అందరి దృష్టి పడింది.
మొన్నటికి మొన్న జరిగిన యూపీ ఎన్నికల సందర్భంగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు సంధించుకున్న సంగతి తెలిసిందే. వాటిని మర్చిపోయిన చందంగా.. నవ్వుతూ పలుకరించుకున్న దృశ్యాలు ఆసక్తికరంగా మారటమే కాదు.. అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించాయి.
యోగి ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లిన ములాయం.. అఖిలేశ్ ఇద్దరూ.. పరస్పరం పలుకరించుకోవటం కనిపించింది. మరింత ఆసక్తికరంగా మోడీతో కరచాలనం చేసే సమయంలో మోడీ చెవిలో ములాయం ఏదో చెప్పటం.. దాన్నిఆయన శ్రద్ధగా ఆలకించటం కనిపించింది.అనంతరం.. ములాయం భుజం తట్టటం కనిపించింది. అనంతరం ప్రదాని వద్దకు వెళ్లిన అఖిలేశ్ నమస్కరించగా.. ప్రధాని ఆయన భుజం తట్టి అప్యాయంగా పలుకరించటం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇంతకూ ప్రధాని మోడీ చెవిలో ములాయం ఏం చెప్పారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయనేం చెప్పినా.. మోడీ ప్రతిస్పందన మాత్రం.. పాజిటివ్ గా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి హాజరు కాకపోవటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/