ట్రంప్ గెలుపుకోసం ముస్లింల ప్ర‌చారం!

Update: 2016-03-08 10:21 GMT
డొనాల్డ్ ట్రంప్. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ పేరు ఇపుడు మారుమోగిపోతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వ రేసులో వున్న డొనాల్డ్‌ ట్రంప్ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌కు పెట్టింది పేరుగా మారిన సంగ‌తి తెలిసిందే. ముస్లింపై విద్వేష‌క‌ర వ్యాఖ్య‌లు మొదలుకొని దేశంలో ఉంటున్న భార‌తీయుల వ‌ర‌కు అంద‌రిపైనా ట్రంప్ అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై ముస్లింల్లో పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కానీ చిత్రంగా ఇపుడు ముస్లింలే ట్రంప్‌ కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ట్రంప్ ఎన్నిక‌ల ప్రచార బృందంలో ఇప్పుడు దక్షిణాసియా దేశాలకు చెందిన సిక్కు - ముస్లింల బృందం చేరింది. 'సిఖ్‌ అమెరికన్స్‌ ఫర్‌ ట్రంప్‌' 'ముస్లిం అమెరికన్స్‌ ఫర్‌ ట్రంప్‌' అన్న నినాదాలతో ఈ బృందం తమ తొలి భేటీని వాషింగ్టన్‌ నగర శివార్లలోని మేరీలాండ్‌ లో నిర్వహించిం ది. ఈ భేటీలో ట్రంప్‌ ప్రచార శిబిరానికి చెందిన ప్రతినిధి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్‌ గతంలో ముస్లింలు - ఇతరమైనార్టీల పట్ల చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని - ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికయితే దేశంలో మైనార్టీల ప్రయోజనం కోసం మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తారని ట్రంప్‌ ప్రతినిధి వారికి వివరించారు. ట్రంప్‌ సిక్కు - ముస్లిం మైనార్టీలకు ఏ మాత్రం వ్యతిరేకం కాదని, ఆయన వ్యాఖ్యలను ప్రధాన మీడియా వక్రీకరించిందని సిఖ్‌ అమెరికన్స్‌ ఫర్‌ ట్రంప్‌ సదస్సును నిర్వహించిన జస్దీప్‌ సింగ్‌ చెప్పారు.
Tags:    

Similar News