తిరుపతి ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరింది. అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ, మధ్యలో బీజేపీ-జనసేనలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఆయా పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలోకి దిగి మాటల తూటాలు పేల్చుతున్నారు.
వైసీపీ తరుఫున మంత్రులు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచార బరిలో ఉన్నారు. వారు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళుతూ వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గెలుపు కోసం పాటుపడుతున్నారు. బీజేపీ-జనసేన నేతలు కలిసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
టీడీపీ తరుఫున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాజాగా వైఎస్ జగన్, ఎంపీలను పిల్లులతో పోల్చి లోకేష్ చెప్పిన కథ సభలో ఆకట్టుకుంది. ‘సీఎం జగన్, వైసీపీ ఎంపీలు పిల్లులు అని.. మోడీని చూస్తే ఈ పిల్లులన్నీ మియామ్ అంటూ టేబుల్ కింద దాక్కుంటాయని.. ఇప్పుడు తిరుపతి నుంచి మరో పిల్లిని ఢిల్లీకి పంపిద్దామా? ’ అంటూ నారా లోకేష్ చెప్పిన పిల్లుల కథ ఆకట్టుకుంది. జగన్, ఎంపీలను పిల్లులతో పోల్చి నారాలోకేష్ విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోడీని చూస్తే ఏపీలోని పెద్ద పిల్లి వంగిపోతుందని నారా లోకేష్ విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ బిల్లును ప్రవేశపెట్టిన వైసీపీ వాళ్లు మారు మాట్లాడకుండా మద్దతు ఇస్తారని లోకేష్ విమర్శించారు.
తిరుపతి నుంచి మరో పిల్లిని ఢిల్లీకి పంపించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని నారా లోకేష్ విమర్శించారు. తమ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తిరుపతి నుంచే వైసీపీ పతనానికి శ్రీకారం చుట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.