సొంత పార్టీ ప్రభుత్వాన్ని నాశనం చేసే వరకు నవ్ జోత్ సింగ్ సిద్ధూ నిద్రపోయేట్లులేడు. మరో ఏడు మాసాల్లో పంజాబ్ లో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతిపక్షాలను ఎదుర్కోటానికి అన్నీ విధాలుగా సిద్ధం కావాల్సిన పార్టీ నేతలు అంతర్గత కలహాలతో ప్రతిరోజు గొడవలు పడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ను పదవిలో నుండి తప్పించాలంటు అసమ్మతివాదులు ప్రత్యేకంగా భేటీ అవ్వటం సంచలనంగా మారింది.
చాలాకాలంగా అమరీందర్-సిద్ధూ మధ్య చాలా గొడవలున్నాయి. వీళ్ళమధ్య ఆధిపత్య పోరులో ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతల్లో కూడా స్పష్టమైన చీలికవచ్చేసింది. దాంతో అమరీందర్ ను పదవిలో నుండి దింపేసేందుకు సిద్ధు చేయని ప్రయత్నాలులేవు. ఇక్కడ విషయం ఏమిటంటే అమరీందర్ కు సోనియాగాంధి మద్దతుంది. సిద్ధూకి రాహూల్, ప్రయాంకగాంధీల మద్దతుంది. దాంతో చాలాకాలంగా ఎవరు ఎవరినీ మార్చలేకపోతున్నారు. ఈ కారణంగా పంజాబ్ లో గొడవలు బాగా పెరిగిపోయాయి.
గొడవలు తారాస్ధాయికి చేరుకోవటంతో చివరి ప్రయత్నంగా సోనియా, రాహూల్, ప్రియాంకలు మాట్లాడుకుని సిద్ధూని పంజాబ్ పీసీసీ అధ్యక్షునిగా చేశారు. అక్కడితో సమస్యలు పరిష్కారమైపోతాయని, అమరీంతర్+సిద్ధు కలిసి పనిచేస్తారని అనుకున్నారు. కానీ మంగళవారం ఐదుగురు మంత్రులు+26 మంది ఎంఎల్ఏలు సీఎంపై తిరుగుబాటు చేశారు. వీళ్ళంతా సిద్థూ మద్దుతుదారులే అనే ప్రచారం ఉంది. అంటే వీళ్ళ తిరుగుబాటు వెనుక కచ్చితంగా సిద్ధూనే ఉన్నాడనే విషయం అందరికీ అర్ధమైపోతోంది.
సాధారణ ఎన్నికలు ఏడునెలల ముందు ఎవరు కూడా సీఎంను మార్చరు. పైగా అమరీందర్ ఏమీ అసమర్ధుడు కూడా కాదు. పార్టీతో పాటు జనాల్లో కూడా మంచి ఆదరణ ఉన్న వ్యక్తే. అయినా సిద్ధూతో పడని కారణంగానే ప్రభుత్వం+పార్టీలో కంపు పెరిగిపోతోంది. ఈ గొడవలను ఎలా నియంత్రించాలో ఎవరికీ అర్ధం కావటంలేదు. చివరకు వీళ్ళద్దరి మధ్య గొడవల ప్రభావం రాబోయే ఎన్నికల మీద పడటం ఖాయమని అందరికీ అర్ధమైపోతోంది.
రేపు ఎన్నికల్లో టికెట్ల విషయంలో వీళ్ళద్దరి మధ్య గొడవలు ఇంకా పెరిగిపోవటం ఖాయం. అమరీందర్ మద్దతుదారులకు టికెట్లివ్వకూడదని సిద్ధూ పట్టుబడతాడు. తన మద్దతుదారులకే టికెట్ల పంపిణీలో ప్రాధాన్యత ఇచ్చుకుంటాడటనటంలో సందేహంలేదు. దీన్ని అమరీందర్ నూరుశాతం వ్యతిరేకిస్తాడు. అప్పుడు రెండు గ్రూపులు ముందు టికెట్ల కోసం తర్వాత గెలుపుకోసం రోడ్లపై పడతాయి. దీన్ని ప్రతిపక్షాలు అడ్వాంటేజ్ తీసుకుంటే ప్రభుత్వం+పార్టీ కుప్పకూలిపోతుంది. అప్పుడుకానీ సిద్ధూ ప్రశాంతంగా ఉండడేమో. చూద్దాం చివరకు ఏమవుతుందో.