ఏపీలో ప్రస్తుతం పరిషత్ ఎన్నికలు సాగుతున్న విషయం తెలిసిందే. గతంలోనే ఇచ్చిన నోటిఫికేషన్ కు అనుగుణంగా ఈ ఎన్నికలు సాగుతున్నాయి. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కానీ చంద్రబాబు నిర్ణయాన్ని మెజార్టీ నేతలు ధిక్కరించారు. ఆయా చోట్ల పోటీలో ఉన్నారు. పోటీనుంచి తప్పుకుంటే క్యాడర్ చెల్లా చెదురు అవుతుందని వాళ్లు భయపడుతున్నారు.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 8న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంపీటీసీ - జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల రోజు సెలవు ప్రకటించాలని .. అలా అయితేనే అన్ని వర్గాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం ఉంటుందని నీలం సాహ్ని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆ రోజున సెలవు ప్రకటించాలంటూ ఆమె ప్రభుత్వానికి లేఖ రాశారు.
అంతేకాక పోలింగ్ జరిగే రోజు అన్ని చోట్ల కార్యాలయాలు, వ్యాపారాలు బంద్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడాలని కోరారు. ఎన్నికల విధుల నిర్వహణకు ప్రభుత్వ వాహనాలు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పిస్తూ ఓ జీఓ జారీ చేశారు. వాహనాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఇటీవలే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఓటర్లకు కుడిచేతికి ఇంక్ మార్క్ వేశారు. ఆ మార్క్ చాలా మందికి చెరిగిపోలేదు. కాబట్టి ఇప్పుడు ఎడమ చేతికి ఇంక్ మార్క్ వేయాలని ఆదేశించారు. ఏ ప్రభుత్వ అధికారి కూడా రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించకూడదని ఆమె సూచించారు. ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మరోవైపు ఏపీలో పరిషత్ ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. అన్ని రాజకీయపార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి.