జర్నలిజంలో ఒక్కోసారి ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయనేందుకు ఇదో ఉదాహరణ. అలాంటి సమయంలో గుండె నిబ్బరంతో వ్యవహరించి పలువురి హృదయాల్లో నిలిచిన ధీరవనిత గాథ ఇది. సహజంగానే మీడియాలో పని చేసేవారు భావావేశాలకు లోనుకాకుండా విధులు నిర్వర్తిస్తుంటారు. పలు సందర్భాల్లో వ్యక్తిగత ఆలోచనలకు, వ్యక్తిగత స్పందనలను మర్చిపోయి విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే భర్త మృతి వార్తనే బ్రేకింగ్ న్యూస్ గా న్యూస్ రీడర్ చదవిన ఘటన మీడియా ప్రతినిధులను ఆవేదనకు గురి చేసింది. అలాంటి ఘటనే ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...సుప్రీత్ కౌర్ (28) గత తొమ్మిదేళ్లుగా ఛత్తీస్ గఢ్ లోని ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్నారు. ఆమెకు హర్సద్ కవాడే అనే వ్యక్తితో గతేడాది వివాహమైంది. వీరిద్దరూ రాయ్ పూర్ లోనే నివాసం ఉంటున్నారు. ఈ ఉదయం విధులకు హాజరైన ఆమె రిపోర్టర్ ఇచ్చిన సమాచారం ప్రకారం పితార ప్రాంతంలో ఓ రెనాల్ట్ డస్టర్ కారు ప్రమాదానికి గురైందని అందులో ఐదుగురు ప్రయాణిస్తుండగా ముగ్గురు మృత్యువాతపడ్డారని హెడ్ లైన్స్ లో చదివారు. అయితే ఆ కారు తన భర్తదేనని, ఆ కారును నడుపుతున్న వ్యక్తి కూడా తన భర్తేనని, ఆయన మరణించారని ఆమెకు వార్తలు చదువుతున్న సమయంలోనే అర్థమయింది! అయినప్పటికీ వృత్తి ధర్మాన్ని విస్మరించని ఆమె మనోనిబ్బరంతో బాధను దిగమింగి బులెటెన్ ముగించి ఇంటికి వెళ్లారు.
ఆమె వెళ్లిన కొద్ది సేపటి తర్వాత టీవీలో పనిచేసే మిగతా సిబ్బంది ఈ వార్త తెలుసుకున్న సిబ్బంది విషణ్ణవదనులైపోయారు. దీనిపై వారు స్పందిస్తూ...‘మహసముండ్ జిల్లాలోని పితారా వద్ద రెనో డస్టర్ వాహనం ఈ ఉదయం ఘోర ప్రమాదానికి గురైందని, వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు మృత్యువాత పడినట్టు రిపోర్టర్ వివరించగానే ఆమెకు కారు తన భర్తదేనని గుర్తించింది. అయితే వార్తల బులెటిన్ మధ్యలో అక్కడి నుంచి వెళ్లిపోకుండా న్యూస్ బులెటిన్ పూర్తి చేసి వెళ్లారు. ఆమెతో కలిసి పనిచేస్తునందుకు మేమంతా గర్వపడుతున్నాం. కానీ ఆమె జీవితంలో జరిగిన పెద్ద సంఘటన నుంచి కోలుకునే ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాం` అని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/