కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దేశానికి ఆర్ధిక మంత్రిగా ప్రధాని తరువాత ర్యాంక్ లో ఉన్నారు. అంతకు ముందు ఆమె కీలకమైన రక్షణ శాఖను కూడా నిర్వహించారు. ఇక తాజాగా గోదావరి జిల్లాలతో పాటు విశాఖ టూర్ సందర్భంగా ఆమె చేసిన కొన్ని సంచలన కామెంట్స్ వైసీపీకి షాకులు ఇస్తే టీడీపీకి హుషార్ ని ఇఛ్చాయని అంటున్నారు.
వర్తమాన రాజకీయాలను పరికిస్తే ఏపీలో బీజేపీతో టీడీపీ చెలిమి చేయాలని చూస్తోంది. కానీ బీజేపీ ససేమిరా అంటోంది. కానీ కేంద్ర మంత్రి హోదాలో ఉంటూ మోడీ అమిత్ షా టీం లో కీలకమైన మెంబర్ గా ఉన్న నిర్మలా సీతారామన్ తాజాగా విశాఖ జిల్లా టూర్ లో భాగంగా ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాలలో పాలుపంచుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ ని పొగడడం పట్ల రాజకీయంగానూ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
రాముడు, క్రిష్ణుడు అంటే వేరే ఎవరో కాదు, ఎన్టీయార్ మాత్రమే అని అన్నారు. ఆయనను ఆ వేషంలో చూస్తే దేవుల్ళు ఇలాగే ఉంటారు అనిపించేలా పాత్ర పోషణ చేశారు అని ప్రశంసించారు. తాను చిన్నపుడు ఎక్కువగా ఎన్టీయార్ సినిమాలే చూసేదాన్ని అని ఆమె చెప్పుకున్నారు. ఎన్టీయార్ తన అభిమాన హీరో అని ఆమె పేర్కొన్నారు. ఎన్టీయార్ నటన అద్భుతమని, ఆయన ఏ పాత్ర పోషించినా కూడా దానికి పరిపూర్ణత తీసుకువచ్చేవారు అని నిర్మలా సీతారామన్ ఎన్టీయార్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు.
ఎన్టీయార్ వెండితెర కధానాయకుడే కాదు, రాజకీయాల్లో కూడా చక్రం తిప్పి అనితరసాధ్యుడిగా పేరు తెచ్చుకున్నారని ఆమె ప్రశంసించారు. ఆయన తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడమే కాకుండా జాతీయ రాజకీయాల్లోనూ అద్భుతంగా రాణించారు అని ఆమె అన్నారు. ఎన్టీయార్ లాంటి వారు అరుదైన నాయకులు అని కూడా పేర్కొన్నారు.
అదే టైం లో ఆమె వైసీపీని టార్గెట్ చేసినట్లుగా కనిపించారు. గోదావరి జిల్లాల టూర్ లో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ని అయితే తాను నిధులు ఇచ్చినా ఆరేళ్ళలో మంచి నీటి ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేకపోయారు అని ప్రజల ముందే విమర్శించారు.
విశాఖ టూర్ లో అయితే జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఆర్ధిక మంత్రిగా నిశిత పరిశీలన చేస్తూ తూర్పార పట్టారు. ఆదాయం ఉంటే ఎన్ని అయినా ఉచితంగా ఇవ్వవచ్చు. ఉచితాలు ఇవ్వాలనుకునే వారు ఆదాయలను కూడా పెంచుకోవాలి తప్ప అప్పులు చేసి ఇవ్వడం కాదు అంటూ డైరెక్ట్ గానే జగన్ మీద బాణాలు వేశారు.
ఎందుకంటే కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఆమెకు ఏపీ ఆర్ధిక పరిస్థితి మీద పూర్తి అవగాహన ఉంది అంటున్నారు. మొత్తానికి నిర్మలమ్మ తాజా టూర్ మాత్రం వైసీపీకి షాకుల మీద షాకులు ఇస్తే టీడీపీకి ఎడతెగని ఆనందాన్ని ఇచ్చిందని అంటున్నారు. ఇవాళ కాకపోయినా ఎన్నికల వేళకు అయినా బీజేపీ టీడీపీ చెలిమి ఖాయమని కూడా అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.