మోడీ ఇన్విటేష‌న్ పై ట్రంప్ డిసైడ్ కాలేద‌ట‌!

Update: 2018-08-02 08:45 GMT
ఊహించ‌ని రీతిలో ఇన్విటేష‌న్లు పంపి.. అతిధుల్ని దేశ ప‌ర్య‌ట‌న‌కు రప్పించ‌టంలో మోడీ స్టైల్ ను మెచ్చుకోవాల్సిందే. దేశ ప్ర‌ధానిగా బాధ్య‌త‌ల్ని చేప‌ట్టే స‌మ‌యంలో.. ఆయ‌న ప‌లు దేశాధిప‌తుల్ని ఆహ్వానించ‌టం అప్ప‌ట్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. అనంత‌రం ఒబామాను 2015 రిప‌బ్లిక్ వేడుక‌ల‌కు ముఖ్య అతిధిగా ఆహ్వానించ‌టం.. ఆ వెంట‌నే ఆయ‌న ఓకే చెప్ప‌టం.. వ‌చ్చేయ‌టం అప్ప‌ట్లో హాట్ న్యూస్ గా మారింది.

తాజాగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను వ‌చ్చే ఏడాది జ‌రిగే రిప‌బ్లిక్ వేడుకుల‌కు హాజ‌రుకావాల్సిందిగా ఇన్విటేష‌న్ పంపారు. ఈ విష‌యాన్ని వైట్ హౌస్ క‌న్ఫ‌ర్మ్ చేసింది. అయితే.. ఒబామా మాదిరి.. ట్రంప్ వెంట‌నే నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌టం గ‌మ‌నార్హం. త‌మ‌కు ఆహ్వానం అందింది కానీ.. గ‌ణ‌తంత్ర వేడుకుల‌కు వ‌చ్చే అంశంపై ట్రంప్ ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదని.. వైట్ హౌస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

భార‌త్‌.. అమెరికాల మ‌ధ్య త్వ‌ర‌లో వ్యూహాత్మ‌క చ‌ర్చ‌లు జ‌రగ‌నున్నాయి. ఈ స‌మావేశం త‌ర్వాతే భార‌త ప‌ర్య‌ట‌న మీద ట్రంప్ ఒక నిర్ణ‌యానికి రానున్న‌ట్లు సారా చెబుతున్నారు. రెండు దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం బ‌లంగా ఉంద‌ని.. ఆ బంధాన్ని మ‌రింత బ‌ల‌ప‌ర్చుకోవాల‌ని అమెరికా భావిస్తున్న‌ట్లు చెప్పారు. ఒక‌వేళ‌.. అదే నిజ‌మైతే.. మోడీ ఇన్విటేష‌న్ పంపాక‌.. నిర్ణ‌యం తీసుకోవ‌టానికి ఇంత వెయిట్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు క‌దా? ఒక‌వేళ మోడీ ఇన్విటేష‌న్ కు ట్రంప్ కానీ ఓకే అంటే.. త‌న పాల‌నా కాలంలో ఇద్ద‌రు అమెరికా అధ్య‌క్షుల్ని రిప‌బ్లిక్ డే వేడుకుల‌కు తీసుకొచ్చిన రికార్డు మోడీ పేరిట న‌మోదు కావ‌టం ఖాయం.
Tags:    

Similar News