కిమ్ కి అసలేమైంది .. ఆ తలకట్టు వెనుక రహస్యమేంటి ?

Update: 2021-08-03 13:30 GMT
కిమ్ జంగ్ ఉన్.. ఇతడి పేరు వింటే అమెరికా సైతం గజగజ వనకాల్సిందే. ఉత్తర కొరియాను ప్రపంచం నుంచి వేరు చేసిన ఈ అధినేత ఆగడాలు గురించి తెలిస్తే,మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామో అర్థం అవుతుంది. కేవలం కిమ్ మాత్రమే కాదు. అతడి కుటుంబం మొత్తం అంతే. వారికి ఎవరైనా ఎదురైతే సొంతవాళ్లని కూడా చంపేయడం వారి ఆనవాయితీ. అలాంటి ఆ ప్రభుత్వంలోని అధికారులు, ఆ దేశంలో నివసించే ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఆ దేశంలో ఇప్పటికీ సుమారు 100 ఏళ్లు వెనకబడే ఉందంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంటర్నెట్ ఉండదు. కేవలం మూడే టీవీ చానెళ్లు మాత్రమే ఉంటాయి. ఫోన్లు ఉపయోగించకూడదు. అక్కడి పేదలకు ఫొటోలు తీయకూడదు. ఇలా ఇంకా ఎన్నో నిబంధనలు ఉన్నాయి. ప్రపంచమంతా కరోనా వైరస్‌తో అల్లాడుతుంటే.. ఆ దేశంలో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే.

ఇదిలా ఉంటే .. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తలకి ముదురు ఆకుపచ్చ రంగులోని మచ్చ, బ్యాండేజి కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జూలై 24 నుంచి 27 వరకు ఆయన కొరియన్ పీపుల్స్ ఆర్మీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ఆయన తలకు వెనుక భాగంలో మచ్చ, బ్యాండేజ్ కనిపించాయని ఎన్‌ కే న్యూస్ సైట్ ప్రకటించింది. ఆయన జూలై 27 నుంచి 29 వరకు పాల్గొన్న మరికొన్ని కార్యక్రమాల్లో కూడా ఇదే విధంగా కనిపించారని వెల్లడించింది. కిమ్ తల వెనుక భాగంలో తపాలా స్టాంపు పరిమాణంలో ముదురు ఆకుపచ్చ రంగులో మచ్చ లేదా వాపు కనిపించినట్లు తెలిపింది.

ఈ మచ్చను బ్యాండేజితో కప్పి ఉంచినట్లు తెలిపింది. దీనికి కారణాలను ఫొటోల ద్వారా నిర్థరించడం కష్టమని, జూన్ 29న ఆయన పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్నపుడు ఈ మచ్చ కనిపించలేదని, జూలై 11న ఆయన మ్యుజిషియన్లతో కలిసి కనిపించినపుడు విడుదల చేసిన ఫొటోలలో ఆయన తల వెనుక భాగాన్ని చూపించలేదని తెలిపింది. ఇదిలావుండగా, దక్షిణ కొరియా జాతీయ నిఘా సేవల విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తర కొరియాలో అసాధారణ పరిస్థితులేవీ కనిపించలేదు. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక విషయాలేవీ లేవు. కొద్ది రోజులపాటు కనిపించిన ప్యాచ్‌ ను ఆ తర్వాత తొలగించారని, ఆ స్థానంలోని మచ్చ కూడా కనిపించలేదని తెలుస్తోంది. ఇటీవల కిమ్ జోంగ్ ఉన్ సుమారు 20 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం.

ఉత్తర కొరియాలోకి అడుగుపెట్టగానే తప్పకుండా కొత్త గ్రహానికి వెళ్లాం అనిపిస్తుంది. అక్కడి ప్రజలను చూస్తే.. తప్పకుండా జాలి కలుగుతుంది. అక్కడి నిబంధనలు గురించి తెలిస్తే.. అసలు మానవ హక్కులు ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది. నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌‌ను అక్కడి ప్రజలకు దేవుడు అనుకుంటారు. ఎందుకంటే దేవుడు అని ఒప్పుకోకపోతే అక్కడ బ్రతకడం కష్టం. కిమ్ తనని తాను దైవంగా భావిస్తాడు. ఈ సందర్భంగా ప్రజల కోసం కొన్నాళ్ల కిందట తన బయోగ్రఫీని విడుదల చేశాడు. అందులో.. తాను రెండు ఇంధ్ర దనస్సుల మధ్య నుంచి పుట్టానని, ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం పుట్టిందని తెలిపాడు. అంతేకాదు.. అతడికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉదంట.

ఉత్తర కొరియాలో జులై 8, డిసెంబరు 17 తేదీల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదు. కనీసం పుట్టిన రోజు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే.. కిమ్ తాత కిమ్ 2 సంగ్, కిమ్ తండ్రి కిమ్ జంగ్ 2లు ఆ తేదీల్లోనే చనిపోయారు. ఉత్తర కొరియా పిల్లలకు ప్రపంచ చరిత్రతో పనిలేదు. వారికి కేవలం కిమ్ పూర్వికులు కిమ్ జంగ్ 1, కిమ్ జంగ్ 2ల చరిత్రను బోధిస్తారు.ఉత్తర కొరియా ప్రజలు నేరాలు చేయాలంటేనే భయపడిపోతారు. ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే.. అతడి తర్వాతి రెండు తరాలు కూడా జైలు శిక్ష అనుభవించాలి. అంటే.. మూడు తరాలు తమ జీవితమంతా జైల్లోనే గడపాలన్నమాట. ఆ దేశంలో కిమ్ ఆగడాలను వ్యతిరేకించి అనేక మంది జైల్లో ఉన్నారు. సుమారు 2.5 లక్షల మంది బంధీలుగా ఉన్నారు.


Tags:    

Similar News