దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించటంతో పాటు.. అందరిని షాక్కు గురి చేసిన ముంబయి పబ్ ఫైర్ యాక్సిడెంట్ ఉదంతంలో ఆ ఇద్దరు గురించి అందరూ చెప్పుకుంటున్నారు. ఎగిసిపడుతున్న అగ్నికీలలకు ఏ మాత్రం వెరవకుండా తమ ప్రాణాల్ని రిస్క్ లో పడేసుకొని 30 మందిని కాపాడిన ఆ ఇద్దరు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. అయితే.. తమ మేనత్తను సేవ్ చేయబోయి ప్రాణాలు పోగొట్టుకున్న వైనం అందరి కంట తడి పెట్టిస్తోంది.
ముంబయిలోని వన్ అబవ్ పబ్ లో చోటు చేసుకున్న ఫైర్ యాక్సిడెంట్ లో 15 నిండు ప్రాణాలు పోవటం తెలిసిందే. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత పబ్ సిబ్బంది ఎవరికి వారు పరుగులు తీస్తూ బయటకు వెళ్లిపోయారు. ప్రమాదం జరిగిన సమయానికి పబ్ లో దాదాపు 150 మంది వరకు ఉన్నారు. ఎక్కువ మంది మంటల్లో చిక్కుకుపోయి సాయం కోసం అరుస్తున్నారు. ఇలాంటివేళ.. అమెరికాకు చెందిన ఇద్దరు ఎన్నారై సోదరులు ప్రదర్శించిన సాహసం అంతా ఇంతా కాదు.
26 ఏళ్ల దరియా లలానీ.. 23 ఏళ్ల విశ్వ లలానీలు ఇద్దరు అమెరికాలో ఉంటారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో వారు ఇండియాకు వచ్చారు. గురువారం పలు ఫంక్షన్లకు హాజరై..రాత్రి మేనత్తను తీసుకొని ఖుష్బూ బన్సాలీ బర్త్ డే ఫంక్షన్ కు వచ్చారు. పార్టీ వేళ.. ఈ ఇద్దరు బద్రర్స్ ద్వారానికి దగ్గర్లోనే ఉన్నారు.
మంటలు మొదలుకాగానే.. సాయం కోసం అర్థిస్తున్న వారికి సాయం చేశారు. దాదాపు 30 మందిని కాపాడి బయటకు పంపారు. వారూ కిందకు వచ్చేశారు. ఆ హడావుడిలో తమ మేనత్త గురించి వారు మర్చిపోయారు. మేనత్తను రక్షించాలన్న తపనతో వారు మళ్లీ పబ్ లోకి వెళ్లారు. లేడీస్ వాష్ రూమ్ దగ్గర ఉన్నారని గుర్తొచ్చి పైకి వెళ్లారు. ఆమెతో పాటు.. కొందరు మిత్రులు అక్కడే ఉండటంతో వారికి సాయం చేసి కొందరిని తీసుకొచ్చారు. పొగ కారణంగా స్పృహ కోల్పోయిన మేనత్తను బయటకు తీసుకొచ్చే క్రమంలో ఇద్దరు సోదరులు తుది శ్వాస విడిచారు. వీరి ఉదంతం గురించి తెలిసిన వారంతా అయ్యో అనకుండా ఉండలేకపోతున్నారు.