ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల్లో వచ్చే కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇదే క్రమంలో మరణాల సంఖ్య కూడా పెరగడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఒక్క రోజులో పది లక్షలకు పైగా కేసులు నమోదు కావడం ప్రపంచ ఆరోగ్య సంస్థ కలవరపెడుతుంది. వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు డబ్ల్యూహెచ్ఓ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలు వివిధ దేశాలకు సూచించింది. ఈ నేపథ్యంలోనే వాక్సినేషన్ పూర్తిస్థాయిలో తీసుకోవాలని అన్ని దేశాలకు సూచనలు చేసింది. అయితే కరోనా వైరస్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా నమోదవుతున్నాయి. వివిధ దేశాల్లో కూడా సాధారణ వైరస్ కేసులు కంటే కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ కేసులు పెద్ద ఎత్తున నమోదు కావడం మూడో వేవ్ కు సూచన కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే కరోనా కొత్త వేరియంట్ అయినా ఒమిక్రాన్ తన లక్షణాలనూ మరింత పెంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా కరోనా వైరస్ వచ్చిన వ్యక్తికి దగ్గు, జలుబు, ఊపిరి ఆడకపోవడం, జ్వరం రావడం ఇలాంటివి జరుగుతాయి. అయితే బ్రిటన్కు చెందిన కొందరు శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ప్రకారం ఒమిక్రాన్ తన లక్షణాలను మరింత విస్తృతం చేసుకున్నట్లు తేలింది. జో కోవిడ్ యాప్ అధ్యయనం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ ను చాలా మంది లైట్ గా పరిగణించ పడుతున్నప్పటికీ, కొత్త లక్షణాలు మాత్రం తీవ్ర ప్రభావం కలుగుతుందని తేలింది. కొత్త లక్షణాలు ముఖ్యంగా వైరస్ సోకిన వ్యక్తికి వికారంగా అనిపించడం, రోజు రోజుకు ఆకలి మందగించడం లాంటివి ఉంటాయి అని తేలింది.
బ్రిటన్ నేషనల్ హెల్త్ సొసైటీ చేసిన సర్వే ప్రకారం కరోనా వైరస్ మొదటగా ఈ లక్షణాలను కలిగి ఉంటుంది. వాటిలో ప్రధానంగా జ్వరం ఎక్కువగా రావడం, ఫ్లూ ఉండడం, నిరంతర దగ్గు రావడం, వాసన లేదా రుచి క్రమ క్రమంగా మందగించడం జరుగుతుంది. అయితే తాజా సర్వేలో వికారం, ఆకలి లేకపోవడం కూడా జరుగుతుందని స్పష్టమైనట్లు ఈ సర్వే తెలిపింది. లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌లోని జెనెటిక్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ ప్రకారం రెండు డోసులు ను పూర్తిగా తీసుకున్న వారిలో కానీ బూస్టర్ డోస్ తీసుకున్న వారిలో కానీ ఈ లక్షణాలు చాలా సాధారణంగా కనిపిస్తున్నట్లు తెలిపారు.
వీటితోపాటు మరికొందరిలో వికారం గా ఉండడం, జ్వరం స్వల్పంగా రావడం, గొంతు నొప్పి, తలనొప్పి వంటివి కూడా వస్తున్నాయని సర్వేలో స్పష్టమైనట్లు టీమ్ స్పెక్టర్ తెలిపారు. అమెరికాలో జరిపిన పరీక్షల్లో ఎక్కువమంది సాధారణ లక్షణాలను కలిగి ఉన్నట్లు తెలిసింది. ఓమిక్రాన్ వేరియంట్ నాలుగు అత్యంత సాధారణ లక్షణాలు దగ్గు, అలసట, తలనొప్పి, ముక్కు కారటం ఉన్నాయని చెప్పారు. మరి కొంత మందిలో వాంతులు కూడా ఒక లక్షణంగా ఉందని పేర్కొన్నారు.