తెలుగు భాషకు, తెలుగు వారికి తమను తాము కేరాఫ్ అడ్రస్‌గా తమను తాము చెప్పుకొనే తెలుగుదేశం పార్టీకి చెందిన ఏపీ మున్సిపల్ శాఖమంత్రి నారాయణ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా తెలుగు మాధ్యమ చదవులు వృథా అంటూ తేల్చేశారు. నంద్యాలలో మున్సిపల్ పాఠశాల విద్యార్థులు - తల్లిదండ్రులతో ముఖాముఖీ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు మీడియం దండగ అని వ్యాఖ్యలు చేశారు. తెలుగు మీడియంలో చదవితే ర్యాంకులు రావంటూ ఆశ్చర్యరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ పోటీ పరీక్షల్లో అయిదువేల లోపు ర్యాంకు వచ్చే వాళ్లలో ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థులు ఉండరని నారాయణ జోస్యం చెప్పారు. ఇంగ్లిష్ మీడియం అయితేనే ర్యాంకులు వస్తాయని నారాయణ విశ్లేషించారు. అందుకోసమే త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేశామన్నారు. పేరులోనే తెలుగు అనే పదాన్ని జోడించిన పార్టీ నాయకుడు మాతృభాషను ఇంతగా తీసిపారేయడం ఆశ్చర్యంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/