పవన్ దమ్ము, ధైర్యమేంటో తేలిపోయిందా ?

Update: 2021-11-01 11:33 GMT
ఎక్కడ బహిరంగ సభ జరిగినా దమ్ము, ధైర్యం గురించి మాట్లాడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ దమ్ము, ధైర్యమేంటో తెలిసి పోయింది. తాను ఎవరి కీ భయ పడను అని పదే పదే చెప్పుకునే పవన్ కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి నరేంద్ర మోడీ అంటే ఎంత భయమో అందరికీ అర్థమై పోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే వైజాగ్ లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీ కరణకు వ్యతిరేకం గా బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భం గా పవన్ మాట్లాడుతూ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు మూల కారణమైన నరేంద్ర మోడీ నిర్ణయాన్ని తప్పు పడుతూ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

పైగా ఎలాంటి సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం పదే పదే తప్పు పట్టారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వ సంస్ధ అన్న విషయం అందరికీ తెలిసిందే. తన సంస్థ ను కేంద్రం ప్రై వేటీకరణ చేయాలని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అడ్డుకోగలదు ? ప్రైవేటీ కరణ నిర్ణయాన్ని రాష్ట్రం లోని ఎంపీలందరూ వ్యతిరేకించాలని పవన్ చెప్పటం లో తప్పేలేదు. అంతే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ రీతి లో కేంద్రం నిర్ణయాన్ని అడ్డుకోలేదు.

నిజాని కి వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు అయినా ఇపుడు జగన్ అయినా కేంద్రం నిర్ణయాన్ని అడ్డుకోలేరు. కేంద్రం ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నపుడు ఒక్క వైజాగ్ స్టీల్స్ గురించి నిర్ణయాన్ని మార్చుకోదు.

వైజాగ్ స్టీల్స్ ప్రై వేటీకరణ ప్రక్రియ 2024 ఎన్నికల వరకు ఆలస్యమైతే అప్పటి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి కేంద్రం నిర్ణయం లో మార్పులుండే అవకాశం ఉంది. ఎన్డీయే కి ముఖ్యం గా బీజేపీ కి ఎంపీల బలం తగ్గిపోతే ఏపీ లో అధికారం లోకి వచ్చే పార్టీ ఎంపీల మద్దతు కీలక మైనపుడు అప్పుడేమైనా బేరాలు పెట్టగలిగి తే మోడి నిర్ణయం లో మార్పు ఉండే అవకాశం ఉంది. నిజం గానే ఏపీ ఎంపీల మద్దతే కీలకమైతే ప్రత్యేకహోదా, విశాఖ కేంద్రం గా ప్రత్యేక రైల్వేజోన్, విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణ లాంటివన్నీ చకచకా జరిగిపోతాయి.

అధికారం లో చంద్రబాబున్నారా లేకపోతే జగన్ ఉన్నారా ? అన్న దాంతో సంబంధం లేకుండా ఏపీ ప్రయోజనాలను మోడి పట్టించుకోదలచుకోలేదు. ఎందుకంటే రాజకీయం గా బీజేపీ కి ఏపీ తో వచ్చేది లేదు కొత్త గా పోయేదీ లేదు. ఒక వేళ ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ లాంటివి మంజూరు చేసినా ఏపీ లో బీజేపీకి ఒక్క సీటు వస్తుందనే గ్యారెంటీ మోడీకి ఉన్నట్లులేదు. అందుకనే ఏపీని పూర్తిగా పక్కనపెట్టేస్తున్నారు. ఈ విషయం తెలిసినా నరేంద్రమోడి ని పవన్ ఒక్కమాట కూడా నిలదీయలేకపోతున్నారు. దీంతోనే పవన్లోని దమ్ము, ధైర్యమేంటో తెలిసిపోతోంది.
Tags:    

Similar News