నిజమేనండోయ్... జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొట్టిన దెబ్బకు వామపక్షాలకు లెఫ్ట్ అండ్ రైట్ వాయిపోయిందనే చెప్పాలి. పవన్ బరిలోకి దిగేందుకు సిద్ధం కాగానే... తాము కూడా జతకడతామంటూ వామపక్ష పార్టీలు సీపీఐతో పాటు సీపీఎం కూడా పవన్ మాట కోసం ఆశగా ఎదురు చూశాయి. ఈ విషయంలో సీపీఎం కాస్తంత హూందాగానే వ్యవహరించినా... సీపీఐ మాత్రంచొక్కాలు చించుకునేంత పని చేసింది. పవన్ తో తమ పొత్తు ఖాయమేనని, పవన్ తో కలిసి రాష్ట్రంలో సత్తా చాటుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పదే పదే చెప్పుకొచ్చిన వైనం మనకు తెలియనిదేమీ కాదు. అయినా పవన్ కున్న నాన్ స్టెబిలిటీ మెంటాలిటీ తెలిసి కూడా ఆయనతో చేతులు కలిపేందుకు ఎందుకు ఉత్సాహం చూపుతారండీ అంటూ సొంత పార్టీ నేతలు మొత్తుకున్నా... అతడు తప్పించి మనకు దిక్కులేదన్నట్లుగా రామకృష్ణ వ్యవహార సరళి నడిచింది.
సరే... ఎలాగోలా సీపీఎంతో కలిసి మంతనాలు జరిపిన సీపీఐ... జనసేన నుంచి రెండేసి ఎంపీ సీట్లతో పాటు ఏడేసి అసెంబ్లీ సీట్లను లాక్కుంది. ఈ స్థానాల్లో పోటీ చేసే నేతలకు జనసేన మద్దతు పలకాలి.... జనసేన బరిలో నిలిచే స్థానాల్లో లెఫ్ట్ నేతలు వారికి మద్దతుగా నిలవాలి.... ఇదీ మొత్తంగా ఒప్పందం. అయితే నామినేషన్లు ముగియకుండానే... పవన్ తన నాన్ స్టెబిలిటీ మెంటాలిటీని బయటపెట్టుకున్నారు. సీపీఐకి కేటాయించిన నూజివీడు అసెంబ్లీ సీటుకు జనసేన అభ్యర్థిని ప్రకటించిన పవన్... విజయవాడ ఎంపీ సీటులో మాత్రం గట్టిగా సపోర్ట్ చేస్తాంలే అని సీపీఐని బుకాయించారు. పవన్‌ను గుడ్డిగా నమ్మేసిన రామకృష్ణ సరేనని తలూపారట. రామకృష్ణ ఇలా తలూపి అలా ఇంటికెళ్లారో లేదో... సీపీఐకి కేటాయించిన విజయవాడ ఎంపీ సీటుకు కూడా జనసేన అభ్యర్థిని ప్రకటించిన పవన్... రామకృష్ణకు గట్టి షాకే ఇచ్చారట.
విజయవాడ ఎంపీ సీటుకు జనసేన అభ్యర్థిగా ముత్తంశెట్టి ప్రసాద్ ను ఖరారు చేస్తూ పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నూజివీడు సీటును వదులుకుంటే... ఇప్పుడు ఏకంగా తమకు కేటాయించిన విజయవాడ ఎంపీ సీటుకు కూడా అభ్యర్థిని ప్రకటిస్తే ఎలాగంటూ ఇప్పుడు రామకృష్ణ తల పట్టుకున్నారట. అయితే లెఫ్ట్ ఏడుపులు, పెడబొబ్బలను పట్టించుకునే స్థితిలో ఇప్పుడు పవన్ లేరనే చెప్పాలి. ఎందుకంటే.... ఈ ఎన్నికల్లో తాను కింగ్ మేకర్‌ను అవుతానన్న భరోసా వచ్చిందో, ఏమో తెలియదు గానీ... గడచిన మూడు, నాలుగు రోజుల నుంచి పవన్ తనతైన స్పీడు చూపిస్తున్నారు. ఈ స్పీడులో రామకృష్ణ అరిచినా, గీపెట్టినా కూడా పవన్ పట్టించుకునే అవకాశాలే లేవన్న వాదన వినిపిస్తోంది. ఇదే జరిగితే.. వామపక్షాలతో జనసేన పెట్టుకున్న పొత్తు... పోటీకి దిగకుండానే అటకెక్కేసినట్టేనన్న మాట.