పవన్ విగ్రహం పరిస్థితేంటి?

Update: 2016-12-07 06:37 GMT
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన విగ్రహావిష్కరణకు ఇంకా తలూపకపోవడంతో ఆ విగ్రహం అనాథలా పడి ఉంది. ఆలనాపాలనా లేకుండా తమ కథనాయకుడి విగ్రహం ఉండడం చూసి అభిమానులు ఆవేదన చెందుతున్నారు.  ప‌శ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పవన్ అభిమాని ఒకరు ఆయన విగ్రహాన్ని తయారుచేయించి  ముఖ్య  కూడలిలో ప్రతిష్టించారు.. అయితే, దాన్ని ఇంతవరకు ఆవిష్కరించలేదు.   పవన్ నుంచి అనుమతి రాకపోవడంతో ముసుగు వేసి వదిలేశారు.
    
అయితే... తాజాగా దానిపై ఉన్న ముసుగు కొంత తొలిగిపోయింది.  దీంతో పవన్ విగ్రహం అందరికీ దర్శనమిస్తోంది... సగం ముసుగు వేసి, సగం కనిపిస్తూ ఉన్న ఈ విగ్రహం చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
    
తాడేపల్లిగూడెంకు చెందిన జనసేన నాయకుడు సీతాల మోహన్‌చందు ఈ విగ్రహాన్ని తయారుచేయించి ప్రతిష్ఠించినట్లు సమాచారం. అయితే... పవన్ మాత్రం ఇలా  విగ్రహాలు పెట్టించుకోవడం ఇష్టం లేదని  చెప్పారని... పవన్ కు నచ్చని పని చేయడం ఎందుకున్న ఉద్దేశంతో దాన్ని అలాగే వదిలేశారని తెలుస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News