అరే.. కేసీఆర్ మాట‌ల్ని కాపీ చేశారేంది ప‌వ‌న్‌?

Update: 2017-09-16 05:18 GMT
భిన్న రాజ‌కీయ దారుల్లో ప‌య‌నించే ఇద్ద‌రు ముఖ్య‌నేత‌ల భావోద్వేగం ఒకేలా ఉండ‌టం విచిత్ర‌మ‌నే చెప్పాలి. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌లు చూస్తే కాస్తంత ఆశ్చ‌ర్యం క‌లిగించేలా ఉన్నాయ‌ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌మ్ టీఆర్ ఎస్ పార్టీ అధినేత అయిన కేసీఆర్ నోటి నుంచి  ఏ త‌ర‌హా మాట‌లు అయితే వ‌స్తాయో.. దాదాపు ఆ త‌ర‌హాలోనే ప‌వ‌న్ తాజా మాట‌లు ఉండ‌టం గ‌మనార్హం.

ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టిన‌ట్లుగా చెప్పే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో త‌న‌కు అండ‌గా నిలిచిన అభిమానుల‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. అయితే.. ఈ వ్యాఖ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్య త‌ర‌హాలోనే ఉండ‌టం విశేషంగా చెప్పాలి. ట్విట్ట‌ర్ లో త‌న ఫాలోయ‌ర్స్ సంఖ్య ఇర‌వై ల‌క్ష‌లు దాటిన సంద‌ర్భంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు చెప్పారు.

మూడేళ్ల క్రితం తాను జ‌న‌సేన ప్ర‌యాణం షురూ చేసిన‌ప్పుడు దారంతా గోతులు.. చేతిలో దీపం లేద‌ని.. ధైర్య‌మే క‌వ‌చంగా ఒకే గొంతుక‌తో మొద‌లుపెట్టిన‌ట్లుగా చెప్పారు. తాను స్పందించిన ప్ర‌తి స‌మ‌స్య‌కు తామున్నామంటూ ప్ర‌తి స్పందించిన ప్ర‌తి ఒక్క‌రికీ.. ఈ రోజు 20 ల‌క్ష‌ల దీపాల‌తో దారంతా వెలిగించిన మీ అభిమానానికి శిరస్సు వంచి కృతజ్ఞతలు అంటూ చెప్పుకున్నారు.

తాను టీఆర్ఎస్ పార్టీ పెట్టిన‌ప్పుడు తాను ఒక్క‌డినేన‌ని.. చుట్టు చిమ్మ‌చీక‌టి అని.. ఎటు వెళ్లాల‌న్న దారి తెలీకున్నా.. ఆత్మ‌విశ్వాసంతో తాను ప్ర‌యాణం మొద‌లుపెడితే.. త‌న వెంట అంద‌రూ న‌డిచార‌ని.. ద‌శాబ్దాలుగా తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన‌ట్లుగా కేసీఆర్ చెప్ప‌టం క‌నిపిస్తుంది. తాజాగా ప‌వ‌న్ మాట‌లు సైతం కేసీఆర్ మాదిరే ఉండ‌టం విశేషం. త‌న‌కుతెలిసి చేశారో.. తెలీక చేశారో కానీ కొద్ది గ్యాప్ అనంత‌రం ప‌వ‌న్ పెట్టిన ట్వీట్ లో కంటెంట్‌.. కేసీఆర్ మాట‌ల్ని గుర్తుకు తెచ్చేలా ఉండ‌టం చూస్తే.. ఒకే త‌ర‌హా భావోద్వేగం క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News