కాంగ్రెస్ హయాంలో.. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా వెలుగువెలిగిన మాజీ ఎంపీ హర్షకుమార్ తన దూకుడును మాత్రం తగ్గించుకోవడం లేదు. అదే ఆయనకు ఇప్పుడు చిక్కులు తెచ్చిపెట్టింది. రాజమండ్రిలో కోర్టు స్థలాల్లో జోక్యం చేసుకొని న్యాయమూర్తిని, కోర్టు సిబ్బంది, ఉద్యోగులపై దుర్భాషలాడిన ఆయన ఇప్పుడు కేసులు చుట్టుమట్టడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇందుకు సహకరించిన సీఐని పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది.
రాజమండ్రిలోని కోర్టు స్థలంలో కబ్జాలు పెరిగిపోయాయి. కొందరు ఆక్రమించుకోవడంతో గతనెల 28న జిల్లా న్యాయమూర్తి, సిబ్బంది, ఉద్యోగులు రాజమండ్రి కోర్టుకు చెందిన స్థలంలో ఆక్రమణలను తొలగించే పనిచేపట్టారు. అయితే అక్కడకు మాజీ ఎంపీ హర్షకుమార్ వచ్చి వారిని పరుష పదజాలంతో దూషించాడు. జిల్లా న్యాయమూర్తినే తిట్టాడు.మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కోర్టు ఉద్యోగులను బెదిరించాడు. ఉద్యోగులను నెట్టాడు. దీంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు కోర్టు పరిపాలనాధికారి హర్షకుమార్ పై రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అయితే త్రీటౌన్ సీఐ శేఖర్ బాబు అరెస్ట్ చేసేందుకు హర్షకుమార్ ఇంటికివెళ్లాడు. ఆయన ముందే హర్షకుమార్ పారిపోతున్నా పట్టుకోవడానికి ప్రయత్నించలేదు. పోలీసులను పట్టుకునేందుకు అనుమతించలేదు. ఈ విషయం డీఐజీకి తెలియడంతో సీరియస్ అయ్యాడు. సీఐ శేఖర్ బాబును సస్పెండ్ చేశారు. అతడు హర్షకుమార్ కు సహకరించాడని తేలితే అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ఇలా రాజమండ్రి కోర్టు భూముల లొల్లిలో తలదూర్చి ఇప్పుడు హర్షకుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనను పట్టుకునేందుకు డీఐజీ ఖాన్ నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.