దక్షిణాది భాషా చిత్రాల్లో విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న ప్రకాశ్ రాజ్... ఇటీవలి కాలంలో సినిమా రంగంతో ముడిపెడుతూ రాజకీయాలపై వరుసగా సెటైర్లు సంధిస్తున్నారు. సినీ నటుల రాజకీయ రంగ ప్రవేశంపై చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న ఆయన... అడపాదడపా నేరుగా ఫక్తు పొలిటీషియన్ల మీదా ప్రశ్నాస్త్రాలు కురిపిస్తున్నారు. అసలు ప్రకాశ్ రాజ్ సంధిస్తున్న ప్రశ్నలకు ప్రత్యర్థి వర్గాల నుంచి ఇప్పటిదాకా పెద్దగా స్పందన వస్తున్న దాఖలా కనిపించడం లేదు. అప్పుడెప్పుడో ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై ఒకరో - ఇద్దరో నేతలు విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కూడా ప్రకాశ్ రాజ్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదనే చెప్పాలి. నిన్నటికి నిన్న కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా జరిగిన ఓ సమావేశంలో పాలుపంచుకున్న ఆయన సినీ తారల పొలిటికల్ ఎంట్రీపై నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో చేరిన నటులకు ఓట్లు వేయరాదంటూ ఆయన పిలుపునిచ్చి పెద్ద సంచలనమే రేపారు. సినీ తారలు పాలిటిక్స్ లోకి వస్తే దేశం సర్వ నాశనం అయిపోతుందని కూడా ఆయన సంచలన వ్యాఖ్య చేశారు.
ఇదే క్రమంలో ఆయన కేంద్రంలోని బీజేపీ సర్కారు - యూపీలోని ఆదిత్యనాథ్ యోదీ సర్కారుపైనా విమర్శలు గుప్పించారు. వెరసి తనకు తాను ప్రకాశ్ రాజ్ ఇబ్బంందులను కొని తెచ్చుకున్నట్లైందనే చెప్పాలి. హిందూ ఉగ్రవాదం, ఉత్తరప్రదేశ్ ఆసుపత్రిలో పిల్లల వరుస మరణాలు - గౌరీ లంకేష్ హత్య తదితర విషయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ - యూపీ సీంఎం యోగి అదిత్యనాథ్ మీద విమర్శలు చేసిన ప్రకాష్ రాజ్ కు బీజేపీ ఎంపీ ఝలక్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ఒక సామాన్య నటుడు మాత్రమేనని - ప్రపంచం గర్వించదగిన నటుడేమీ కాదని బీజేపీ యువనేత - కర్ణాటకలోని మైసూరు ఎంపీ (బీజేపీ) ప్రతాప్ సింహా అన్నారు. కాసేపటి క్రితం మైసూరులో మీడియాతో మాట్లాడిన ప్రతాప్ సింహా... ప్రకాష్ రాజ్ మీద విమర్శలు గుప్పించారు. రాజ్ కుమార్ - నందమూరి తారకరామారావు - అమితాబ్ బచ్చన్ - ఎంజీఆర్ తదితర మహానటులు సైతం ప్రకాష్ రాజ్ మాట్లాడినట్లు ఒక్క సారికూడా మాట్లాడలేదని సింహా గుర్తు చేశారు. తాను మహానటుడిని అంటూ ప్రకాష్ రాజ్ తనంతకు తాను ఊహించుకుంటున్నాడని ఆయన ఎద్దేవ చేశారు.
ఒక చోట విమర్శలు చేసి మరో చోటకు పారిపోయే ప్రకాష్ రాజ్ లాగా తాను పారిపోనని, తనకు ప్రజలు ఓటు వేసి ఎంపీగా గెలిపించారని, తన నియోజక వర్గం వదిలి పారిపోవడం సాధ్యం కాదని కూడా సింహా చెప్పారు. ప్రకాష్ రాజ్ ఆరోపణల వెనుక సొంత లాభం ఏమైనా ఉందా అనే అనుమానం వస్తోందని సింహా అన్నారు. ఉత్తరప్రదేశ్ లో పిల్లల వరుస మరణాలపై మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్... అదే కర్ణాటకలోని కోలారు ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వరుస మరణాలు జరిగినా ఎందుకు ప్రశ్నించలేదని - ఈ రాష్ట్రంలో దారుణ హత్యకు గురైన ఆర్ ఎస్ ఎస్ నాయకుడు శరత్ మడివాళ హత్య కేసులో ఎందుకు స్పంధించలేదని, అప్పుడు ప్రకాశ్ రాజ్ కు కళ్లుకనపడేదా అంటూ కాస్తంత ఘాటు ప్రశ్నలనే సంధించారు. ప్రధాని మోడీ - ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లపై ఆరోపణలు గుప్పించిన మాదిరే... ప్రజలు తాను ప్రకాశ్ రాజ్ ను అలాగే ప్రశ్నిస్తున్నామని సింహా మాటలతూటాలు పేల్చారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే తగినబుద్ది చెబుతారని హెచ్చరికలు కూడా జారీ చేశారు.