డెల్టా లాంటి విధ్వంసం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు

Update: 2022-01-04 02:30 GMT
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. కొత్త  కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. వారం రోజుల కిందటి వరకు 10 వేల లోపు నమోదు అయిన కేసులు సంఖ్య ఇప్పుడు అమాంతంగా పెరిగి  33 వేలకు చేరింది. 127 మంది వైరస్ కారణంగా చనిపోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు తెలిపారు. సుమారు 25 నుంచి 35 శాతం మేర కేసుల లోడ్ పెరిగినట్లు పేర్కొన్నారు. మరో వైపు కొత్త వేరియంట్ కేసులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక్క సారిగా అప్రమత్తం అయ్యింది. కొత్త వేరియంట్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

భారీగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక అంశాలను సూచిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకోవాలి కోరింది. ఇందుకు తగినట్లుగా  రాష్ట్రాలు సిద్ధం కావాలని సూచించింది. మూడో వేప్ పై ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వైరస్ ఆంక్షలను కఠినంగా  అమలు చేయాలని పేర్కొంది. ప్రజలు మాస్క్ లను కచ్చితంగా ధరించేలా చర్చలు చేపట్టాలని కోరింది. వ్యాక్సినేషన్ పూర్తి అయిన కానీ కోవిడ్ ప్రోటోకాల్ ను తప్పక పాటించాలని చెప్పింది.

మరోవైపు  దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉన్నాయి. డెల్టా వేరియంట్ సృష్టించిన విధ్వంసాలు దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి భావిస్తున్నాయి. వీటితో పాటే కేంద్ర సూచించిన వాటిని పాటిస్తున్నాయి. మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా మందుల కొరత లేకుండా చూడాలని కేంద్రం సూచించింది.

గతంలో ఆక్సిజన్ కోసం చాలా ఇబ్బందులు పడినట్లు పేర్కొన్న కేంద్రం.. ఈ సారి ఉత్పత్తి పెంచాలని కోరింది. వైరస్ కేసులు ఎక్కువ అయ్యే కొద్ది ఆసుపత్రులపై ఎక్కువ ప్రభావం పడుతుందని తెలిపారు. ఇందుకుగాను ఆస్పత్రిలో బెడ్ల కొరత లేకుండా చూసుకోవాలని కోరింది. ఇక పాజిటివిటీ రేటు ఢిల్లీలో అమాంతం పెరిగిన నేపథ్యంలో రెడ్ అలెర్ట్ ప్రకటించాలని ఢిల్లీ సర్కారు భావిస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే లాక్ డౌన్ తప్పనిసరి అని అధికారులు చెప్తున్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పిల్లలకు నేటి నుంచి వ్యాక్సినేషన్ ను ప్రారంభించింది కేంద్రం. కొవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన వారికి టీకాలు పంపిణీ చేస్తోంది.
Tags:    

Similar News