అంతర్జాతీయంగా మరో సంచలనం చోటు చేసుకుంది. ఒక ఆరోపణ.. దానికి సంబంధించిన వివరణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది అక్టోబరు 31న రష్యా విమానం కూల్చివేతకు గురి కావటం తెలిసిందే. ఈ దుర్మార్గాన్ని ఐఎస్ తీవ్రవాదులు చేశారని ఆరోపించారు. విమానాల్ని కూల్చి వేసేంత టెక్నాలజీ ఐఎస్ తీవ్రవాదులకు లేదన్న వాదన బలంగా వినిపిస్తున్నా.. రష్యా మాత్రం నేరాన్ని ఐఎస్ మీద వేసింది. అయితే.. విమాన శకలాల దగ్గర ఎక్కడా కూడా విమానాన్ని పేల్చేసిన శతఘ్ని దాఖలాలు కనిపించలేదు. ఇదో అనుమానం అయితే.. తాజాగా కేజీబీ (రష్యా గూడాఛార సంస్థ)లో పని చేసిన ఒక మాజీ మేజర్ బోరిస్ కార్పిఖోవ్ తాజాగా బాంబులాంటి ఆరోపణలు చేశారు.
విమానం కూలిపోవటానికి కారణం మరెవరో కాదని.. అది రష్యా అధ్యక్షుడు పుతిన్ అంటూ ఆయన మండిపడుతున్నారు. దీనికి సంబంధించి ఆయన చాలానే వాదనలు వినిపిస్తున్నాడు. విమానంలో వెళ్లే ఒక మహిళా ప్రయాణికురాలికి గిఫ్ట్ ప్యాక్ ఒకటి అందజేసి.. దాన్ని పీటర్స్ బర్గ్ లోని తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పటం ద్వారా విమానాన్ని కూల్చి వేశారని.. ఆ ప్యాక్ లోనే బాంబు ఉందన్న మాటను చెబుతున్నారు. ఒక దేశ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగడతాడా? అన్న సందేహాలు ఒక పక్క వినిపిస్తున్నాయి. మరోవైపు.. పుతిన్ మీద ఇలాంటి ఆరోపణలు కొత్త కూడా ఏమీ కాదని చెప్పొచ్చు. గతంలో రష్యా సీక్రెట్ సర్వీసులో గూఢచారిగా పని చేసిన పుతిన్.. తొలిసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు కూడా ఈ తరహా ఆరోపణలు వచ్చాయి. 1999లో మాస్కోలోని నాలుగు అపార్ట్ మెంట్లలో బాంబు పేలుళ్లు చోటు చేసుకొని 307 మంది మరణించారు.దీనికి కూడా పుతిన్ కారణమన్న ఆరపణలు వచ్చాయి. ఈ పేలుళ్లు చెచెన్యాలోని ముస్లిం తీవ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేస్తూ.. వారిపై దాడులు జరిపారు.
తాజాగా విమానాన్ని కూల్చివేత ఘటనకు సంబంధించి కూడా కీలక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పుతిన్ ఇంత దారుణానికి పాల్పడటం వెనుక పెద్ద వ్యూహమే ఉందని చెబుతున్నారు. చెచెన్యా తిరుగుబాటుదారులకు సహకారం అందించే ఐఎస్ తీవ్రవాదుల్ని అంతం చేసేందుకు.. సిరియాకు అండగా నిలుస్తూ పోరాటం చేస్తున్న రష్యాకు పలు దేశాల నుంచి మద్ధతు కూడగట్టుకునేందుకే ఇంతటి దారుణానికి పాల్పడినట్లుగా వాదన వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే రష్యా విమానం కూలిపోయిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ కు బ్రిటన్ ప్రధాని ఫోన్ చేయటం.. పలు దేశాలు ఐఎస్ మీద యుద్ధానికి తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. పుతిన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ఇలాంటి ఆరోణలు చేస్తున్నారన్న వాదన ఉంది. దేశ ప్రధానిగా ఉంటూ సొంత ప్రజల్ని చంపుకుంటారా? అంటూ ప్రశ్నించే వారు లేకపోలేదు. కాకుంటే.. పుతిన్ వ్యవహరించే తీరు.. ఆయన వ్యూహాలు ఎంత కరుకుగా ఉంటాయో తెలిసిన వారు మాత్రం తాజాగా కార్పిఖోవ్ మాటలపై దృష్టి సారిస్తున్నారు.