యంగ్ గా కనిపించేందుకు స్టెరాయిడ్ తీసుకున్న పుతిన్..?

Update: 2022-06-16 11:33 GMT
ప్రపంచంలో ప్రస్తుత నియంత ఎవరంటే పుతిన్ పేరు ముందుగా చెబుతారు.  ప్రపంచం ఓ వైపు.. తానోవైపు అన్నట్లుగా ఉంటుంది ఆయన ప్రవర్తన. ఇటీవల ఉక్రెయిన్ విషయంలో పుతిన్ మైండ్ సెట్ ఏంటో పూర్తిగా అర్థమైపోయింది.  ఆయనను ఎదుర్కొనేందుకు యూరప్ దేశాలు ఎన్నిప్రయత్నాలు చేస్తున్నా.. ఎత్తుకు పై ఎత్తు వేస్తు తన ప్రాబల్యాన్ని చాటుకుంటున్నాడు. అయితే పుతిన్ గురించి నెట్టింట్లో రోజుకో న్యూస్ వైరల్ అవుతూ ఉంటుంది. ఆయన పర్సనల్  లైఫ్ కు సంబంధించిన ఓ న్యూస్ ప్రజెంట్ చక్కర్లు కొడుతోంది. ఆయన మల, మూత్రాలను ఎవరికీ దొరకకుండా సెక్యూరిటీ సిబ్బందిని దాచేస్తున్నారట. వినడానికి వింతగా ఉన్నా ఇది ఆనోటా..ఈనోటా బయటపడింది. దీంతో విన్నవారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో 70వ దశకంలోకి అడుగుపెట్టబోతున్నాడు. వచ్చే అక్టోబర్ నాటికి ఆయనకు 70 ఏళ్లు పడుతాయి. అయితే ఇప్పటికే పుతిన్ అనేక వ్యాధులతో బాధపడుతున్నారని ప్రచారం సాగుతోంది. ఆయనకు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చిందని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. అయితే అదంతా వట్టిదేనని పుతిన్ అనుకూలురు కొట్టిపారేశారు.

కానీ ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో పుతిన్ నడవడిక, వైఖరిని చూస్తే ఆయన అనారోగ్యంగానే ఉన్నట్లు అర్థమైంది. ఇటీవల విక్టరీ డే సందర్భంగా పుతిన్ ఓ ఫొటో దిగాడు. ఇందులో ఆయనను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆయన కాళ్లపై ఓ దుప్పటి వేసి ఉంది. దీంతో ఆయన అనారోగ్యంపై వస్తున్న కథనాలు నిజమేనా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

అంతేకాకుండా పుతిన్ మోహానికి కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్లు కనిపిస్తోందని వెస్ట్రన్ మీడియా జోరుగా ప్రచారం చేస్తోంది. కణతలు, చెంపలపై ముడతలు తో పాటు గడ్డం, కనురెప్పలకు సర్జరీ చేయించుకున్నారని అంటున్నారు. ఎక్కువగా మీడియాలో కనిపించే పుతిన్ తన వయసు గురించి తెలియకుండా ఇలా సర్జరీ చేయించుకున్నారని అంటున్నారు.

ఇదిలా ఉండగా ఎప్పుడూ యంగ్ గా కనిపించేందుకు స్టెరాయిడ్స్ కూడా వాడారని అంటోంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న పుతిన్ మూడేళ్ల కంటే ఎక్కువగా బతకడు అని కూడా ప్రచారం చేస్తోంది. ఈ వార్తలపై రష్యా విదేశాంగమంత్రి లవ్రోవ్ స్పందించారు. మీడియాలో వస్తున్న కథనాలు ఫేక్ అని అన్నారు. పుతిన్ ఆరోగ్యంగానే ఉన్నారని, కావాలంటే ఆయన ప్రతిరోజు టీవీలో కనిపిస్తారని అన్నారు.

కానీ పుతిన్ చేస్తున్న కొన్ని పనులతో ఆయన థైరాయిడ్ క్యాన్సర్ తో  బాధపడుతున్నట్లు తెలుస్తోంది.  దీనిని తగ్గించుకునేందుకు 2016 నుంచి 2019 వరకు జింక కొమ్ముల నుంచి తీసిన రక్తంతో తుడిచేవారట. అలా 166 రోజుల పాటు పుతిన్ మాయం కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కానీ తాజాగా ఆయన హెల్త్ ఇష్యూపై ఒక్కొక్కటి బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇదే తరుణంలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది పుతిన్ మల, మూత్రాలను దాచిపెడుతుందట. ఎందుకంటే ఆయనకొచ్చిన వ్యాధి ప్రపంచానికి తెలిస్తే తనపై ఇతర ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నందున ఇలా చేస్తున్నారని అంటున్నారు.
Tags:    

Similar News