దుబ్బాక ఉప ఎన్నిక పుణ్యమా అని.. తెలుగు రాజకీయాల్లో.. అందునా తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనంగా మారారు రఘునందన్ రావు. తాజాగా ఆయన హైదరాబాద్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నింట్లోకి ముఖ్యమైనది.. కీలకమైనది టీఎస్ లో 30నుంచి 40 మంది ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారన్నారు. వారంతా బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు.
రఘునందన్ నోటి నుంచి వచ్చిన మాట గులాబీ బాస్ కు గుబులు పుట్టేలా చేస్తుందని చెప్పాలి. అంతేకాదు..దుబ్బాక ఫలితం గ్రేటర్ లోనూ రిపీట్ అవుతుందన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా తనపై పెట్టిన కేసుల్ని కోర్టులో గెలుస్తానన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించిన ఆయన.. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడితే ఆలస్యంగా అయినా విజయం దక్కుతుందన్నారు.
గ్రేటర్ లో అందిస్తున్న వదర సాయం పూర్తిగా ఎన్నికల కోసమేనని పేర్కొన్న ఆయన.. ఆ సాయాన్ని పూర్తిగా ఎన్నికల కోసం పంపిణీ చేసిన డబ్బుగానే పరిగణిస్తామన్నారు. జీవితాంతం బీజేపీలో కొనసాగుతానని చెప్పిన ఆయన హైదరాబాద్ లో కాషాయ జెండా ఎగరటమే తన కలగా పేర్కొన్నారు. గులాబీ తోటలో బిగ్ బాస్ మీద గుర్రుగా ఉన్నారన్న కొత్త విషయంతో పాటు.. వారిని బీజేపీలోకి రావాలని చెప్పిన తీరు చూస్తే.. రఘునందన్ నోటి నుంచి వచ్చిన మాటల్లో అంతో ఇంతో నిజం ఉందన్న మాట వినిపిస్తోంది.